ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన తల్లికి వందనం పథకాన్ని మరికొద్ది రోజుల్లో అమలు చేయనుంది. అలానే సైనింగ్ స్టార్ అవార్డులు పేరుతో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో ఉత్తమ ప్రతిభ చూపించిన వారికి పురస్కారాలు అందజేస్తోంది. అలానే విద్యా రంగానికి సంబంధించి మరో కీలక పథకమైన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ లను స్కూల్లో ప్రారంభించి తేదీ అయిన జూన్ 12వ తేదీన పంపిణీ చేయనున్నారు.
ఈ విద్యార్థి మిత్ర కిట్లకు సంబంధించి విద్యార్థులకు కలుగు ప్రయోజనాలు ఏంటి ? ఈ కిట్ లో ఏమేమి ఉంటాయి ? వంటి సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరివరకు చదవగలరు.
🔥 విద్యార్థి మిత్ర కిట్ లు అనగా ఏమిటి? :.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం పాఠశాల లలో మరియు ఎయిడెడ్ పాఠశాల లలో చదువుకుంటున్న విద్యార్థులకు ఉచితంగా వారికి అవసరమగు వస్తువులను కిట్ గా చేసి అందిస్తుంది. ఈ కిట్ కి ప్రముఖ విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీదుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ గా నామకరణం చేశారు.
- ఈ కిట్ అందించడం ద్వారా విద్యార్థులకు మరియు వారి తల్లితండ్రులకు ఆర్థిక భారం తగ్గించనున్నారు.
🔥విద్యార్థి మిత్ర కిట్ పాఠశాలకు చేరనున్న వస్తువులు :
- రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలిస్తుంది.
- ఈ కిట్లు పంపిణీ చేసేందుకు గాను వేసవి సెలవులు ముందు నుండే ప్రణాళికలు చేసింది.
- స్కూల్స్ ప్రారంభం అయ్యే తేదీ నుండే పంపిణీ ప్రారంభించేందుకు సమగ్ర శిక్ష అభియాన్ ఏర్పాట్లు చేస్తుంది.
- జూన్ 12వ తేదీ నుండి జూన్ 20వ తేదీలోగా పంపిణీ పూర్తి చేయాలని స్కూల్ హెడ్మాస్టర్లకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
- మెగా పీఎంటి నిర్వహించేనాటికి తప్పనిసరిగా అందరి విద్యార్థులకు కూడా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు పూర్తిగా అందజేస్తున్నారు.
🔥విద్యార్థి మిత్ర కిట్ లో ఉండే వస్తువులు ? :
- విద్యార్థి మిత్ర కిట్ లో భాగంగా విద్యార్థులకు వివిధ వస్తువులు పంపిణీ చేస్తారు.
- పంపిణీ చేసే వస్తువులు ఏమనగా
- పాఠ్య పుస్తకాలు
- వర్క్ బుక్ లు
- నోట్ బుక్ లు
- ఆక్స్ఫర్డ్ డిక్షనరీ
- 3 జతల యూనిఫాం
- ఒక బ్యాగ్
- ఒక జత బూట్లు
- 2 జతల సాక్స్
- బెల్ట్
- ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ
🔥విద్యార్థి మిత్ర కిట్ లు పంపిణీ కొరకు కమిటీల ఏర్పాటు :
- రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ సక్రమంగా చేసేందుకు గాను రాష్ట్ర , జిల్లా , మండల , పాఠశాలల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.
- కిట్ లో గల వస్తువుల పర్యవేక్షణ కొరకు సీనియర్ అధికారులను నియమించారు.
- విద్యార్థులకు అందచేసేటప్పుడు బయోమెట్రిక్ నమోదు చేస్తారు.
🔥ఒక్కో విద్యార్థి మిత్ర కిట్ ధర 2,279 రూపాయలు & సరికొత్తగా యూనిఫాం :
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఒక్కో కిట్ కి సంబంధించి 2,279 రూపాయలు ఖర్చు చేస్తుంది.
- రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35,94,744 మంది విద్యార్థులకు గాను మొత్తం 953.71 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 778.68 కోట్లు మరియు కేంద్ర ప్రభుత్వం 175.03 కోట్లు ఖర్చు చేస్తున్నాయి.
- విద్యార్థుల యొక్క యూనిఫాం ను సరికొత్త రంగులతో అందించనున్నారు. ఆలివ్ గ్రీన్ కలర్ కలిగిన ప్యాంట్ / గౌను మరియు లైట్ ఎల్లో & గ్రీన్ చారల చొక్కా ను అందించనున్నారు.
- బాల బాలికలు అందరికి ఒకే రకంగా ఒకే కలర్ యూనిఫాం ఇస్తారు.