ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వయో వృద్ధుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ కార్డ్ లను అందిస్తున్న విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయం లలో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ సర్వీసు పొందేందుకు 40/- రూపాయలు సర్వీస్ ఛార్జ్ విధించగా , ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ ను పూర్తి ఉచితంగా (Senior Citizen Card – Free) అందిస్తుంది. దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ (Senior citizens card ) పొందవచ్చు.
సీనియర్ సిటిజన్ కార్డ్ కి సంబంధించి మరిన్ని వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ డిగ్రీ అర్హతతో 10,277 క్లర్క్ ఉద్యోగాలు – Click here
Table of Contents 👇 👇👇
🔥 సీనియర్ సిటిజన్ కార్డ్ కి ఎవరు అర్హులు :
- 60 సంవత్సరాలు దాటి ఉన్న వయసు గల వృద్ధులు అందరూ ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ పొందేందుకు అర్హులు. ఈ కార్డ్ పొందేందుకు వయస్సు తప్ప ఏ ఇతర అర్హత అవసరం లేదు …అందరూ ఈ కార్డ్ ను పొందవచ్చు.
✅ AP నిరుద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు – Click here
🔥 సీనియర్ సిటిజన్ కార్డ్ వలన ఉపయోగాలు:
- సీనియర్ సిటిజన్ కార్డ్ పొందడం వలన అనేక లాభాలు ఉన్నాయి. ఈ కార్డ్ కేవలం గుర్తింపు కార్డ్ లా మాత్రమే కాకుండా పలు విధాలుగా ఉపయోగపడుతుంది.
- సీనియర్ సిటిజనులకు ఆర్టీసీ బస్సులలో సీట్లు రిజర్వ్ చేయబడతాయి మరియు వారికి టికెట్ ధరపై 25 శాతం వరకు రాయితీ లభిస్తుంది.
- ట్రైన్ టిక్కెట్లు సులభంగా పొందేందుకు గాను ప్రత్యేక కౌంటర్లు వుంటాయి మరియు వీరికి టికెట్ రిజర్వేషన్ లో లోయర్ బెర్త్ పొందేందుకు అవకాశం ఉంటుంది.
- బ్యాంకు సేవల విషయానికి వస్తె ఆర్థికేతర సేవలతో పాటు గా ఆర్థిక సేవలు కూడా లభిస్తాయి. వీరు డిపాజిట్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు ఇతర డిపాజిట్ లపై వడ్డీ శాతం అధికంగా ఇస్తారు.
- వీరికి ఆదాయ పన్ను నుండి కూడా కొంత మేరకు మినహాయింపు లభిస్తుంది.
🔥 సీనియర్ సిటిజన్ కార్డ్ కి ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి:
- 60 సంవత్సరాలు దాటిన పురుషులకు మరియు 58 సంవత్సరాలు దారిన స్త్రీ లకు సీనియర్ సిటిజన్ కార్డ్ పొందేందుకు అవకాశం కల్పించారు.
- రాష్ట్రం లో సీనియర్ సిటిజన్ కార్డ్ పొందేందుకు గాను గ్రామ, వార్డ్ సచివాలయం లలో అవకాశం కల్పించారు.
- గ్రామ సచివాలయం లో అయితే డిజిటల్ అసిస్టెంట్ , వార్డు సచివాలయంలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లు సీనియర్ సిటిజన్ కార్డ్ కొరకు దరఖాస్తు చేస్తారు.
- దరఖాస్తు చేసుకున్న వెంటనే , ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా కార్డ్ ను అందిస్తారు.
🔥 అవసరమగు ధ్రువపత్రాలు & వివరాలు :
- సీనియర్ సిటిజన్ కార్డ్ కి దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని వివరాలు మరియు ధ్రువపత్రాలు అవసరం అవుతాయి. వాటిని తీసుకొని సచివాలయం వద్దకు వెళ్తే సీనియర్ సిటిజన్ కార్డ్ వెంటనే పొందేందుకు అవకాశం ఉంటుంది.
- దరఖాస్తు
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
- ఆధార్ కార్డు
- ఆధార్ అప్డేట్ హిస్టరీ
- బ్లడ్ గ్రూప్
- ఎమర్జెన్సీ సమయంలో సంప్రదించవలసిన వ్యక్తి పేరు.
- ఎమర్జెన్సీ సమయం లో సంప్రదించవలసిన వ్యక్తి ఫోన్ నెంబర్
🔥 గతంలో సీనియర్ సిటిజన్ కార్డ్ పొందిన వారు , కార్డ్ లో తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చు :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ కార్డు సర్వీసింగ్ గ్రామ వార్డు సచివాలయాలకు ఇచ్చి చాలా రోజులవుతుంది.
- ఇప్పటికీ కొంతమంది సీనియర్ సిసన్ కార్డుకు దరఖాస్తు చేసుకోగా ఇంకా చాలామంది సీనియర్ సిటిజన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
- గతంలో సీనియర్ సిసన్ కార్డు దరఖాస్తు చేసుకున్నవారు వారి కార్డులు ఏవైనా తప్పులను ఉన్నట్లు గ్రహిస్తే ఆ కార్డులు వివరాలు సరి చేసేందుకు గ్రామ వార్డు సచివాలయంలోనే అవకాశం కల్పించారు.
- ఎవరి కార్డులోనైనా తప్పులు ఉంటే వెంటనే మీయొక్క గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించి సీనియర్ సిటిజన్ కార్డులో తప్పులను సరిదిద్దుకోగలరు.