వీరికి ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తాం – మంత్రి గారు ప్రకటన | త్వరలో కొత్త ఆరోగ్య పథకం కూడా అమలు| Free power to Weavers

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు అమలు అవుతూ వస్తున్నాయి. తాజాగా చేనేతకారులకు ఉచిత విద్యుత్ పథకం అమలు కి సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత గారు తెలియజేశారు.

సూపర్ సిక్స్ పథకాలతో పాటుగా ఇతర పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలు మేరకు సంక్షేమ పథకాలను క్రమంగా ఒకటి తర్వాత ఒకటి అమలు చేసి ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేనేతకారుల కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత గారు చేనేతకారులకు సంబంధించి వచ్చే నెల నుండి అమలు చేయబోయే సంక్షేమ పథకాలు మరియు ఇతర అంశాలను తెలియజేశారు. ఈ అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.

🏹 వివిధ ప్రభుత్వ పథకాలు సమాచారం మీ మొబైల్ కి మేము పంపిస్తాం.. క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి..

Join Our What’sApp Group – Click here

🔥 చేనేతకారుల కోసం ఉచిత విద్యుత్ పథకం అమలు :

  • రాష్ట్రంలో గల చేనేతకారుల లబ్ధి కొరకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయనున్నామని చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత గారు తెలియజేశారు.
  • ఇందులో భాగంగా చేనేత దినోత్సవం అయినా ఆగస్టు 7వ తేదీ నుండి ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు.
  • సాధారణ చేనేతలకు 200 యూనిట్ల వరకు , పవర్ లూమ్స్ వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది.

ఈ ఉచిత ఆన్లైన్ స్కాలర్షిప్ టెస్ట్ రాస్తే 50,000/- గెలుచ్చకోవచ్చు – Click here

🔥చేనేతకారుల కొరకు కొత్త ఆరోగ్య పథకం :

  • చేనేతకారుల ఆరోగ్యం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తుంది అని ప్రకటించారు.
  • ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం చేనేతకారుల ఆరోగ్యానికి గాను సరైన నిర్వహణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని ప్రస్తావించారు .
  • అలానే చేనేత దారులు తయారు చేస్తున్న ఉత్పత్తులను ప్రోత్సహించేలా మరిన్ని ఆప్కో కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చేనేత ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ కల్పిస్తామని తెలిపారు.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!