Thank you CM sir Survey Details : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం ను జూలై 12 వ తేదీ నుండి అమలు చేసింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ ఒక్కొక్క విద్యార్థికి 13,000/- రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తల్లి యొక్క ఆధార్ కి లింక్ కాబడిన అకౌంట్ కి జమ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్టేటస్ చెక్ చేసుకొనేందుకు గాను ఇచ్చిన ఆప్షన్ లలో కేవలం బ్యాంకు పేరు మరియు అకౌంట్ యొక్క చివరి నాలుగు నంబర్లు మాత్రమే డిస్ప్లే కావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఒక ఆప్షన్ లో ఏ బ్యాంకు అకౌంట్ లో డబ్బులు జమ అయ్యాయి అన్న పూర్తి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ను తెలుసుకొనేందుకు అవకాశం ఇచ్చారు.
తల్లికి వందనం పథకం నగదు క్రెడిట్ అయిన అకౌంట్ పూర్తి వివరాలు ఏ విధంగా తెలుసుకోవచ్చు మరియు ఎవరిని సంప్రదించాలి , Thank you CM Sir Survey వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
డ✅ PM కిసాన్ డబ్బులు జమ అయ్యాయా ? లేదా ? ఇలా తెలుసుకోండి – Click here
Table of Contents :
🔥 తల్లికి వందనం నగదు క్రెడిట్ అయిన అకౌంట్ వివరాలు ఇలా తెలుసుకోండి :
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం నగదు లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసింది.
- గతంలో డబ్బులు జమ అయిన పూర్తి బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలిసేవి కావు , కేవలం బ్యాంకు పేరు మరియు అకౌంట్ చివరి నాలుగు నంబర్లు మాత్రమే డిస్ప్లే అయ్యేవి.
- ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది కి ఇచ్చిన ఎంప్లాయ్ మొబైల్ యాప్ నందు ఇచ్చిన కొత్తగా ఇచ్చిన “Thankyou CM Sir” ఆప్షన్ నందు పూర్తి బ్యాంక్ అకౌంట్ నెంబర్ మరియు బ్యాంక్ పేరు కనిపిస్తున్నాయి.
- ఎవరికైనా ఇంకా ఏ అకౌంట్ నందు డబ్బులు జమ అయ్యాయి అన్న అంశాలపై స్పష్టత లేనట్లు అయిన వారు మీ గ్రామ వార్డు సచివాలయం నందు గల సిబ్బంది ను సంప్రదించాలి.
- గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది మీ వివరాలు ను అప్ నందు చెక్ చేసి , మీకు ఏ బ్యాంకు అకౌంట్ నందు డబ్బులు జమ అయ్యాయి అన్నది తెలియచేస్తారు.
- తల్లి పేరు , తల్లి ఆధార్ , తల్లికి వందనం పథకం కి సంబంధించి ఎంత మంది పిల్లలకి మీరు అర్హత కలిగి ఉంది, జమ కాబడిన నగదు వివరాలు , ఏ బ్యాంకు మరియు ఏ బ్యాంకు అకౌంట్ నందు జమ కబడ్డాయి అన్నది అందులో తెలుస్తుంది.
🔥 Thankyou CM sir సర్వే లో పాల్గొనండి:
- తల్లికి వందనం పథకం కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల వివరాలు కన్ఫర్మ్ చేసుకొనేందుకు మరియు ఈ పథకాన్ని అమలు చేసిన గౌరవ CM గారికి లబ్ధిదారులు కృతఙ్ఞతలు తెలుపుకొనేలా అధికారులు thankyou CM sir సర్వే ను ప్రారంభించింది.
- ఈ సర్వే లో భాగంగా తల్లికి వందనం పథకం లబ్ధిదారుల ఇంటికి గ్రామ , వార్డ్ సచివాలయం సిబ్బంది సంప్రదిస్తారు.
- తల్లికి వందనం పథకం మీకు లబ్ది కలిగింది అని తెలియచేసి , మీకు ఏ అకౌంట్ లో డబ్బులు జమ అయ్యాయి అన్నది చూపుతారు.
- వారు చెప్పిన వివరాలు సరిగా ఉంటే , మీ యొక్క ఆధార్ ప్రామాణీకరణ (బయోమెట్రిక్ / ఫేషియల్/ ఐరిష్) తీసుకుంటారు.
- ఇంతటితో సర్వే పూర్తి అవుతుంది.