ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఆగస్టు నెలలో పలు కీలక పథకాలును అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు కూడా శుభవార్త తెలియజేసింది.
రాష్ట్రంలో ఉన్న నాయి బ్రాహ్మణులు సంక్షేమం కొరకు 07/08/2025 న G.O MS.NO:69 ను విడుదల చేసింది. ఈ G.O ద్వారా సెలూన్ లకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నారు.
🔥200 యూనిట్ల ఉచిత విద్యుత్:
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాయిబ్రాహ్మణుల సంక్షేమం కొరకు కీలక నిర్ణయం తీసుకుంది.
- రాష్ట్రంలో ఉన్న నాయిబ్రాహ్మణుల జీవనోపాధికి ఊతం ఇచ్చేలా మరియు సామాజిక సమానతను ప్రోత్సహించేలా హెయిర్ కటింగ్ సెలూన్ కు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేలా ఉత్తర్వులు జారీ చేసింది.
- గతంలో నెలకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్ సెలూన్ లకు అందించేవారు. ఇప్పుడు మరో నెలకు మరో 50 యూనిట్లను అధికంగా ఉచితంగా ఇస్తున్నారు.
- నాయీ బ్రాహ్మణుల సామాజిక-ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని, మరియు అణగారిన వర్గాలకు మద్దతు ఇచ్చే ఉద్దేశంతో, ప్రభుత్వం ఈ సవరణను తీసుకువచ్చింది.
- ఈ GO ను అమలు చేసేందుకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరియు విద్యుత్ శాఖ వారు తగిన చర్యలు తీసుకుంటారు.
- ఈ పథకం అమలు కొరకు అవసరమగు బడ్జెట్ ను బి. సి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు అందిస్తారు.