ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా కుల దృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు గాను గతంలో రెవెన్యూ శాఖ సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారుల ఆదేశించారు.
ఇందులో భాగంగా మరికొద్ది రోజుల్లో కుల దృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే చేయించనుంది.
ఈ కుల దృవీకరణ పత్రాలు సర్వే ద్వారా విద్యార్థులకు, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల తో పాటు ఇతర అన్ని వర్గాల వారికి కూడా ఉపయోగపడుతుంది.
ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
✅ పదో తరగతి అర్హతతో 4,987 ఉద్యోగాలు – Click here
🔥కుల ధ్రువీకరణ పత్రాలు కొరకు ఇంటింటి సర్వే :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పౌరునికి కుల దృవీకరణ పత్రం అందించేందుకు శ్రీకారం చుట్టింది.
- గతంలో కుల ధ్రువీకరణ పత్రాల జారీలో ఉన్న ఇబ్బందులు తొలగిస్తూ రెవెన్యూ శాఖ మరియు గ్రామ అవార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటి సర్వే చేయించేందుకు నిర్ణయించారు.
- కుల ధ్రువీకరణ పత్రాలు కోసం జరిగే ఈ సర్వే సుమోటాగా నిర్వహిస్తారు.
🔥ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు :
- రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా ప్రజలందరికీ కులదృవీకరణ పత్రాలు అందించాలని నిర్ణయించారు.
- ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (RTGS) , పౌర సరఫరాల శాఖ , గ్రామ అవార్డు సచివాలయ శాఖ , రెవెన్యూ శాఖలు కలిసి ఈ సర్వే ను నిర్వహిస్తారు.
🔥 సర్వే విధానం :
- గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వేన నిర్వహించే అవకాశం ఉంది.
- పైన పేర్కొన్న శాఖల వద్ద ఇప్పటివరకు ఉన్న డేటాను అనుసరించి , ఆ సమాచారమే అంతటిని ఇంటిగ్రేట్ చేస్తారు.
- ఆ సమాచారం అంతటినీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లాగిన్ కు పంపించడం జరుగుతుంది.
- ఈ సమాచారం ఆధారంగా ఇంటింటి సర్వే ను నిర్వహిస్తారు.
- గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాల జారీ జరుగుతుంది.
- ఎటువంటి అవాంతరాలు లేకుండా , టాంపరింగ్ జరగకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఈ ధృవ పత్రాలు జారీ చేస్తారు.
🔥 అన్ని కులాల వివరాలు సేకరణ :
- ఈ కుల ధ్రువీకరణ పత్రాల జారీ ఇంటింటి సర్వే సమగ్రంగా నిర్వహిస్తారు.
- గతంలో ఎస్సీ, ఎస్టి, బీసీ కులాల వివరాలు మాత్రమే స్వీకరణ జరిగేది.
- ఈ సర్వే లో భాగంగా ఓసీ కులాల వారి వివరాలు కూడా సేకరించి … అందరికి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు.
- రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఈ కుల ధ్రువీకరణ పత్రాల వివరాలను అవసరాలకు అనుగుణంగా ఇతర డిపార్ట్మెంట్లు అన్నీ కూడా వినియోగించుకునే విధంగా అవకాశం కల్పిస్తారు.