తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో రేషన్ కార్డులకు అప్లై చేసిన వారు రేషన్ కార్డు స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మూడు లక్షలకు పైగా రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు తెలిపింది. మిగతా రేషన్ కార్డులు కూడా వీలైనంత త్వరగా పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకుగాను ఆధార్ కార్డుతో పాటుగా రేషన్ కార్డ్ అనేది తప్పనిసరి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డు అనేది అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమల చేస్తున్న 6 గ్యారంటీలు సంక్షేమ పథకాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా రేషన్ కార్డు తప్పనిసరి.
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు నిమిత్తం తెలియచేసిన మరిన్ని వివరాలు కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
🏹 Join Our What’sApp Group – Click here
🔥కొత్త రేషన్ కార్డ్ ల పంపిణీ ప్రారంభం :
- రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ ను రాష్ట్ర ప్రభుత్వం జూలై 14 నుండి ప్రారంభించింది.
- ఇప్పటివరకు వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించి , అర్హత కలిగిన అందరికీ కూడా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు.
- మొత్తం ఐదు లక్షలు రేషన్ కార్డులు మంజూరు కాగా ఇప్పటికే మూడు లక్షల రేషన్ కార్డులు పంపిణీ జరిగింది.
- రేషన్ కార్డ్ ప్రింటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉందని, మిగతా వారికి కూడా రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మిగతా వారికి ఫిజికల్ కార్డులు పంపిణీ చేసేందుకు మరికొంత సమయం పడుతుందని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి గారు తెలియజేశారు.
🔥ఇంకా రేషన్ కార్డ్ దరఖాస్తు చేయలేదా ? వెంటనే దరఖాస్తు చేసుకోండి :
- రాష్ట్రంలో రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఇంకా ఎవరైనా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకొని వారు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకునేందుకు మ దగ్గరలో గల మీసేవ కేంద్రాలను సందర్శించాలని తెలియజేశారు.
- గతంలో దరఖాస్తు చేసుకున్న సమయంలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు కూడా అవకాశం ఉందని సంబంధిత ధ్రువపత్రాలుతో మీసేవ కేంద్రాల్లో రేషన్ కార్డులో మార్పులు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
🔥రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి అవసరముకు ధ్రువపత్రాలు:
- రాష్ట్రంలో రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకుగాను వివిధ ధ్రువపత్రాలు అవసరమవుతాయి.
- దరఖాస్తు ఫారం
- ఆధార్ కార్డ్
- నివాస ధ్రువ పత్రము
- పైన పేర్కొన్న ద్రోపత్రాలు అన్నీ కూడా ఉండాలి వీటిని పిడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేస్తారు. దరఖాస్తు ఫారం ను కూడా జాగ్రత్తగా పూరించాలి.
సరైన వివరాలు సరైన ధ్రువపత్రాలు లేకపోతే రేషన్ కార్డును తిరస్కరించే అవకాశం ఉంది కాబట్టి దరఖాస్తుదారులు అన్ని అంశాలను సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించి దరఖాస్తు చేసుకోగలరు.
🔥 రేషన్ కార్డు స్టేటస్ ఈ విధంగా తెలుసుకోండి:
- రాష్ట్రంలో ఇప్పటికే రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారు వారి రేషన్ కార్డు యొక్క దరఖాస్తు స్టేటస్ తెలుసుకొనవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్సైట్ అయిన epds.telangana.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- ఆ తరువాత Ration card Search ఆప్షన్ పై క్లిక్ చేసి , Application search పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత సొంత జిల్లా ను సెలెక్ట్ చేసుకొని , Meeseva No select చేసుకుని, మీసేవ వారు ఇచ్చిన దరఖాస్తు సంఖ్యను ఎంటర్ చేయాలి.
- మీదకే ఎంటర్ చేశాక అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది.
✅ Know Your Ration Card Status – Click here