ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పునరుద్ఘాటించారు.
సూపర్ సిక్స్ పథకాలలో ప్రధాన పథకం అయిన ఈ పథకం అమలు విషయమే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలవుతున్న అన్ని రాష్ట్రాల లో సర్వే నిర్వహించి , మరికొద్ది రోజులలో ఈ పథకం అమలు చేయనున్నారు అన్న విషయం తెలిసిందే.
🏹 ఇలాంటి ప్రభుత్వ పథకాల సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.
🔥 ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు :
- రాష్ట్రంలో ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానుకగా ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ప్రజలందరికీ తెలియజేశారు.
- ఈ పథకం అమలు రాష్ట్ర ప్రభుత్వం పై ఆర్థిక భారం అయినప్పటికీ కూడా ఎన్నికల హామీలు అమలు చేయడం లో భాగంగా కచ్చితంగా అమలు చేస్తున్నామని తెలియచేశారు.
- ఆగస్టు 15 నుండి ఈ పథకం అమలు లోకి వచ్చే విధంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని తెలియచేశారు.
🏹 5,000/- రూపాయలతో పోస్టు ఆఫీస్ ఫ్రాంచైజ్ పొందండి – Click here
🔥 జిల్లా పరిధిలోనే ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు :
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించే అంశం పై వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి గారు ఈ పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు.
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నది జిల్లా కే పరిమితం అని సృష్టం చేశారు.
- ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు గాను కొత్తగా బస్ లు కొనుగోలు చేస్తామని , ఇందు కొరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.