ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ, బి.టెక్, డిప్లొమా , ఐటిఐ , పీజీ చదువుతున్న విద్యార్థులకు 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ను విడుదల చేసింది..దీనికి సంబంధించి ఉన్నత విద్య ప్రభుత్వ కార్యదర్శి శ్రీ కోన శశిధర్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
ఇలాంటి వివిధ విద్య, ఉద్యోగ సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అవ్వండి..
✅ Join Our What’sApp Group – Click here
🔥విద్యార్థుల ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ 600 కోట్లను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం :
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా 2024 -25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే 788 కోట్లు విడుదల చేయగా , ఇప్పుడు మరో 600 కోట్లు విడుదల చేశారు. మరికొద్ది రోజులలో మరో 400 కోట్లు విడుదల చేస్తారు.
- దశల వారీగా బకాయిలు అన్ని చెల్లిస్తామని విద్యా సంస్థలకు సృష్టం చేశారు.
🔥విద్యార్థులకు ఇబ్బంది పెడితే కాలేజీల పై కఠిన చర్యలు :
- విద్యా సంస్థలు విద్యార్థులను ఫీజు విషయమై ఇబ్బంది పెట్టవద్దని ప్రభుత్వం ఆదేశించింది.
- ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను క్లాస్ కి హాజరు కాకుండా చేయడం , పరీక్షల హాల్ టిక్కెట్లు ఇవ్వకపోవడం , పరీక్షలు రాయకుండా ఆపడం వంటి న్యాయబద్ధం కాని, ఆమోదయోగ్యం కాని విధంగా ప్రవర్తిస్తే సంబంధిత కాలేజ్ ల పై కఠిన చర్యలకు వెనకాడబోము అని ప్రభుత్వం తెలిపింది.
- అన్ని యూనివర్సిటీ ల వైస్ ఛాన్సలర్ లు ఈ విషయమే వారి పరిధిలో గల అన్ని కాలేజ్ లకు సూచనలు జారీ చేసి , పాటించే విధంగా చూడాలని ఉన్నత విద్య ప్రభుత్వ కార్యదర్శి శ్రీ కోన శశిధర్ గారు తెలియచేసారు.