వ్యవసాయ రంగ అభివృధి కొరకు కేంద్ర ప్రభుత్వం మరో ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన అనే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. కేంద్రంలో గల 11 మంత్రిత్వ శాఖల్లో అమలు లో ఉన్న 36 పథకాలను ఇంటిగ్రేటెడ్ చేసి, ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
ఈ పథకాన్ని ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం గా అమలు చేయనున్నారు. ఈ పథకం యొక్క మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ Join Our Telegram Group – Click here
🔥 ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం అనగా ఏమిటి ? :
- దేశంలో గల వెనుకబడిన 100 జిల్లాలలో వ్యవసాయ అభివృద్ధి కొరకు జాతీయ వ్యాప్తంగా ప్రారంభించనున్నారు.
- మొత్తం 36 పథకాలను విలీనం చేసి , ఈ పథకాన్ని అమలు చేస్తారు.
- ఈ పథకం అమలు కొరకు మొత్తం 24,000/- కోట్లు బడ్జెట్ కేటాయించారు.
✅ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల – Click here
- 2025 – 26 సంవత్సరం నుండి ఆరు సంవత్సరాలు పాటు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
- ప్రతి రాష్ట్రం నుండి కనీసం ఒక జిల్లా ను ఎంపిక చేసి ఈ పథకాన్ని అమలు చేస్తారు.
- ఉద్పాధికత , సాగు విస్తీర్ణం , రుణ వినియోగం అంశాలను పరిగణన లోకి తీసుకొని , జిల్లాల ఎంపిక చేస్తారు.
- ఈ పథకం ద్వారా కనీసం 1.7 కోట్ల రైతులకు లబ్ది చేకూర్చాలని లక్ష్యం.
- ప్రతి జిల్లాలో ఈ పథకం యొక్క పురోగతిని 117 సూచికలు ఏర్పాటు చేసి లెక్కింపు చేస్తారు.
- ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేసి ఈ పథకాన్ని సమీక్ష చేస్తారు.