ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పేదలకు ఉచిత ఇళ్లు & ప్రజలందరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు , కొత్త పాస్ బుక్ లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ శాఖ పై సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయాలను వెల్లడించారు..
పేదలకు కేటాయించనున్న ఇల్లు మరియు జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు మరియు కొత్త పాస్ పుస్తకాలు మరియు మరిన్ని వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు ప్రకటించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు సమీక్షా నిర్ణయాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
🏹 ప్రభుత్వ పథకాల సమాచారం ప్రతీ రోజూ మీ మొబైల్ వాట్సాప్ కి రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి..
🔥 అక్టోబర్ నాటికి శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు జారీ :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల పౌరులు అందరికీ కూడా ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలను అందించాలి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
- ఇందుకు సంబంధించి ఏ విధంగా అందించాలి అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉంది.
- గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల సహకారం తో ప్రజలందరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలను అందిస్తారు.
AP గ్రామీణాభివృద్ధి సంస్థలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు – Click here
🔥పేదలకు ఇళ్లు & జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు పై మంత్రుల కమిటీ :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.
- వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో అర్హులు అయిన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి, మరో రెండేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి.
- మొత్తం నాలుగు సంవత్సరాలలో రాష్ట్రంలో అందరికీ ఇల్లు ఉండే విధంగా , ప్రతీ ఒక్కరికి ఇల్లు అన్న ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని సాధించాలి.
- పేదలకి ఇల్లు మరియు జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గాను రెవెన్యూ , గృహ నిర్మాణ మరియు మున్సిపల్ శాఖ మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
🔥ఆగస్టు లో కొత్త పాస్ పుస్తకాల పంపిణీ :
- రాష్ట్రంలో రీ సర్వే పూర్తి అయిన గ్రామాలలో భూ యజమానులందరికి ఆగస్టు నాటికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలి అని ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశించారు.
- అలానే వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్య రిజిస్ట్రేషన్ ను 100/- రూపాయల రుసుము తో గ్రామ వార్డు సచివాలయం లలోనే పూర్తి అయ్యేలా విధాన రూపకల్పన చేయాలని తెలిపారు.
- సదరు ఆస్తి యొక్క విలువ 10 లక్షల కంటే అధికంగా ఉంటే 1000/- రూపాయల వరకు ఫీజు తీసుకొనేందుకు అవకాశం వుండాలి అని తెలిపారు.
- ఈ రిజిస్ట్రేషన్ల గ్రామ వార్డ్ సచివాలయం లలో పూర్తి అయ్యే విధంగా మార్గదర్శకాలు విడుదల చేయాలని చెప్పారు.
🔥2027 డిసెంబర్ నాటికి రీ సర్వే పూర్తి :
- రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అన్ని గ్రామాల రీ సర్వే కూడా 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి.
- ప్రతి పట్టాదారు పాస్ పుస్తకం పై QR కోడ్ తో పాటు ఆధార్ నెంబర్ ఆధారంగా భూ యజమాని తమ సొంత భూమి వివరాలు తెలుసుకొనేందుకు గాను అవకాశం వుండాలి .