రాష్ట్రంలో గల యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోటీ పరీక్షల నిమిత్తం ప్రభుత్వం ద్వారా ఉచితంగా శిక్షణ కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయులు ఒక ప్రకటనలో వివరాలు తెలియచేశారు.
ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచిత శిక్షణ :
- ఎస్సీ మరియు ఎస్టీ నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షల నిమిత్తం ఉచిత శిక్షణ అందించనుంది.
- ఈ శిక్షణ ద్వారా నిరుద్యోగ అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) , స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) , బ్యాంక్ పిఓ మరియు ఏపీపీఎస్సీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.
- ఇందుకుగాను ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ద్వారా ఈ ఉచిత శిక్షణను ఇవ్వనున్నారు.
- రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి , విశాఖపట్నం కేంద్రాల్లో ఈ శిక్షణ ఇస్తారు.
- ఎంపిక కాబడిన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటుగా స్టైఫండ్ కూడా లభిస్తుంది.
- అతి త్వరలో ఈ శిక్షణకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తామని, నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి గారు తెలిపారు.