నిరుద్యోగులకు శుభవార్త ! నిరుద్యోగ భృతి ఎప్పటి నుండి అమలు చేస్తారో చెప్పేసిన మంత్రి లోకేష్ | AP Nirudyoga Bruthi Scheme Details

నిరుద్యోగ భృతి పథకం
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త తెలియచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగ భృతిని ఈ సంవత్సరం లో నిరుద్యోగులకు అందజేస్తామని తెలియచేశారు.

ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

వివిధ ప్రభుత్వ పథకాల సమాచారం మీ మొబైల్ కు రావాలి అంటే వెంటనే మా What’s App Group లో జాయిన్ అవ్వండి.

🔥 నిరుద్యోగ భృతి పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన – ఈ సంవత్సరంలోనే అమలు :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కి సంబంధించి గుడ్ న్యూస్ తెలియచేసింది. ఎన్నికల హామీలలో ప్రధాన హామీ అయిన ” నిరుద్యోగ భృతి ” అంశం పై కీలక ప్రకటన చేసింది.
  • నిరుద్యోగ భృతిని ఈ ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తామని మచిలీపట్నం లో జరిగిన కార్యకర్తల సమావేశంలో లోకేష్ గారు ప్రస్తావించారు. ఈ సంవత్సరంలోనే నిరుద్యోగ భృతి పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు.
  • ఇప్పటికే గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్ష , మెగా డీఎస్సీ పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం , వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • అలానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కూడా వివిధ ప్రైవేట్ ఉద్యోగాలను కూడా రాష్ట్ర నిరుద్యోగులకు అందించేందుకు అవకాశం కల్పిస్తుంది.
  • నిరుద్యోగ భృతి ఇస్తే వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది.

నిరుద్యోగ భృతి ఎంత ఇస్తారు ?

రాష్ట్రంలో అర్హులైన నిరుద్యోగులకు నెలకు 3,000/- రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తారు. అర్హత ఉన్న నిరుద్యోగుల అకౌంట్లో ప్రతీ నెలా 3,000/- రూపాయలు జమ చేస్తారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు పైన ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

నిరుద్యోగ భృతి ఎప్పటినుండి అమలు చేస్తారు ?

మంత్రి నారా లోకేష్ గారు తాజాగా చేసిన ప్రకటన ప్రకారం ఈ సంవత్సరం చివరిలోపు నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేస్తామని కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన వెల్లడించారు.

గతంలో కూడా నిరుద్యోగ భృతి పథకం అమలు :

టిడిపి పార్టీ 2014లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2019 సంవత్సరంలో ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం అమలు చేసిన తర్వాత ప్రారంభంలో అర్హులైన నిరుద్యోగుల అకౌంట్ లో నెలకు 1,000/- రూపాయలు చొప్పున జమ చేసింది. తరువాత నెలకు 2,000/- రూపాయలు చొప్పున జమ చేసింది. 2019 లో ప్రభుత్వం మారడంతో ఈ పథకం ఆగిపోయింది. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ఈ సంవత్సరం చివరిలోపు అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది.

నిరుద్యోగ భృతి పథకానికి ఎవరు అర్హులు :

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
  • ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం చేస్తూ ఉండకూడదు.
  • ఆదాయపన్ను చెల్లిస్తున్న వారు అనర్హులు
  • ప్రభుత్వ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తప్పనిసరిగా ఉండాలి.

నిరుద్యోగ భృతి కోసం అవసరమైన సర్టిఫికెట్స్ :

నిరుద్యోగ భృతి పథకానికి క్రింది విధంగా అర్హతలు ఉండాలి.

  • కుల ధ్రువీకరణ పత్రం
  • రేషన్ కార్డు
  • ఆధార్ కార్డు
  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ లేదా బీటెక్ సర్టిఫికెట్
  • బ్యాంకు పాస్ బుక్ (NPCI లింకింగ్ తప్పనిసరి)
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *