Headlines

నవ జీవన్ శ్రీ పాలసీ : పొదుపు మరియు భీమా అందించే LIC కొత్త పాలసీ | LIC Nava Jeevan Sri Policy Details

నవ జీవన్ శ్రీ పాలసీ

నవ జీవన్ శ్రీ పాలసీ : ప్రముఖ దిగ్గజ ప్రభుత్వ భీమా రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వారు రెండు కొత్త బీమా పాలసీలను ప్రవేశపెట్టారు. యువతను ఆకర్షించుకునేలా ఉండే ఈ రెండు పాలసీలు పొదుపును మరియు బీమాను ఒకే చోట అందిస్తున్న నాన్ పార్టిసిపేటివ్ మరియు నాన్ లింక్డ్ ఎండోమెంట్ పాలసీలు.

ప్రీమియం చెల్లించి పాలసీ కట్టే పాలసీదారుల లైఫ్ సర్కిల్ ఆధారంగా వారి యొక్క అవసరాల నిమిత్తం తీర్చే విధంగా ఈ పాలసీలను డిజైన్ చేశామని ఎల్ఐసి సంస్థ తెలిపింది.

ఈ రెండు ఎల్ఐసి పాలసీలు యొక్క పూర్తి వివరాల కొరకు ఈ ఆర్టికల్ చదవగలరు.

🏹 Join Our Telegram Group – Click here

🔥 నవ జీవన్ శ్రీ పాలసీ:

  • ఈ పాలసీకి సంబంధించి కనీసం పాలసీ విలువ ఐదు లక్షల రూపాయలు. ఎటువంటి గరిష్ఠ పరిమితి విధించలేదు.
  • ఈ పాలసీని చేసుకునేందుకుగాను 30 రోజుల వయసు నుండి 60 సంవత్సరాల వరకు గల వారు అందరూ పాలసీ తీసుకోవచ్చు.
  • రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్ పొందే విధంగా తక్కువ వయసులోనే పాలసీ తీసుకుని అవకాశం కల్పించారు.
  • ప్రీమియంను 06 , 08 , 10 , 12 సంవత్సరాలలో చెల్లించవచ్చు.
  • ఇది పరిమిత వ్యవధి ప్రీమియం చెల్లింపు పాలసీగా ఉంది.
  • ప్రీమియం చెల్లింపును బట్టి పది సంవత్సరాల నుండి గరిష్టంగా 20 సంవత్సరాలు వరకు పాలసీవ్యవధిని నిర్ణయించుకోవచ్చు.
  • ఈ పాలసీని తీసుకున్న వారికి గ్యారెంటెడ్ ఎడిషన్స్ లభిస్తాయి.
  • పాలసీ యొక్క ప్రీమియం వ్యాధి ఆధారంగా 8.50 నుండి 9.50 శాతం గా లభిస్తుంది.
  • ఈ పాలసీని
  • నెలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఏడాదికి ఒకసారి చెల్లించుకోవచ్చు.

🔥 నవ జీవన్ శ్రీ సింగిల్ ప్రీమియం పాలసీ :

  • ఒకే సారి ప్రీమియం మొత్తం చెల్లించే వారు కోసం LIC సంస్థ నవజీవన్ శ్రీ సింగిల్ ప్రీమియం పాలసీ ను తీసుకువచ్చింది.
  • కనీస ప్రీమియం 1 లక్ష రూపాయలు కాగా , గరిష్ఠ పరిమితి లేదు. చెల్లించిన ప్రీమియం కి 10 రెట్లు భీమా లభిస్తుంది.
  • పాలసీ వ్యవధి ను 5 సంవత్సరాలు నుండి 20 సంవత్సరాలు గా నిర్ణయించారు.
  • పాలసీ చెల్లించిన సంవత్సరం ప్రీమియం లో ప్రతి 1000 రూపాయలు కి 85 రూపాయలు గ్యారంటీ ఎడిషన్ గా లభిస్తాయి.

గమనిక :

పాలసీకి సంబంధించిన వివరాలు మీ అవగాహన కోసం ఈ ఆర్టికల్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ పాలసీ కి సంబంధించిన పూర్తి సమాచారం మరియు మీకేమైనా సందేహాలు ఉంటే మీకు దగ్గరలో ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయం లేదా ఎల్ఐసి ఏజెంట్ ను సంప్రదించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!