ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దీపం – 2 మూడవ విడత సిలిండర్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైనది. ఇప్పటికే రెండు విడతల ద్వారా నగదు అందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ నుండి మూడో విడత నాతో రాయితీ ఇవ్వనుంది. సిలిండర్ బుక్ చేసిన 48 గంటల లోగా నగదు జమ అవుతుందని అధికారులు తెలియజేశారు.
అయితే ఈ పథకం ద్వారా నగదు రాయితీ లభించడం లేదని చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని సూచనలు పాటిస్తే నాగరాజ జమ ఎందుకు అవకాశం ఉంది ఆ సూచనలను ఈ ఆర్టికల్ లో తెలియజేయడం జరుగుతుంది.
✅ ఏపీ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల – Click here
Table of Contents :
🔥 దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ కి బుక్ చేసుకోండి :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దీపం 2 పథకం క్రింద ఉచితంగా మూడవ సిలిండర్ ను బుక్ చేసేందుకు గాను ఆగస్టు 1వ తేదీ నుండి అవకాశం కల్పించారు.
- 2024 నవంబర్ 1వ తేదీ నుండి ప్రారంభించిన ఈ పథకం యొక్క గ్యాస్ సిలిండర్ బుకింగ్ మరియు రెండు గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియ ముగిసింది.
- ఆగస్టు 01 వ తేదీ నుండి మూడవ విడత గ్యాస్ సిలిండర్ బుకింగ్ జరుగుతుంది.
🔥100 శాతం రాయితీ తో దీపం – 2 పథకం గ్యాస్ సిలెండర్:
- గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకున్న లబ్ధిదారులకు పూర్తిగా నగదు రాయితీగా అందిస్తున్నారు.
- కేంద్ర ప్రభుత్వం 21.55 రూపాయలు & రాష్ట్ర ప్రభుత్వం 870 రూపాయలు నగదు రాయితీ కల్పిస్తుంది.
- లబ్దిదారులు డెలివరీ తీసుకున్న 48 గంటలలో రాయితీ డబ్బులు లబ్ధిదారుల ఆధార్ కి లింక్ కాబడిన ఖాతాలలో జమ చేస్తున్నారు.
🔥దీపం పథకం – 2 పథకం సమస్యలు :
- సాధారణంగా ఆధార్ కి లింక్ కాబడిన బ్యాంకు అకౌంట్ కి నగదు రాయితీ జమ అవుతుంది.
- అయితే లబ్ధిదారులకు ఒకటి కంటే అధికంగా బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండడం తో , ఆధార్ కి లింక్ కాబడిన అకౌంట్ ఆక్టివ్ గా లేకపోవడం వంటి సమస్యలు తో నగదు జమ కావడం లేదు.
- కావున లబ్ధిదారులు ముందుగా ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ తో NPCI ఆధార్ మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంది.
- ఇలా చేస్తే అర్హత కలిగిన వారికి నగదు కచ్చితంగా జమ అవుతుంది.