ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కి సంబంధించి కీలక ప్రకటన తెలిపింది. జూన్ 12వ తేదీన అమలుచేసిన తల్లికి వందనం పథకం కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ అప్పుడు అప్డేట్ లు ఇస్తూ వస్తుంది.
జాన్ 12వ తేదీన మొదటి విడత జాబితా విడుదల చేసి లబ్ధిదారులకు నగదు జమ చేయగా ఆ తర్వాత ఇంటర్మీడియెట్ మరియు ఒకటవ తరగతి చదువుతున్న వారికి రెండవ విడత క్రింద నగదు జమ చేసింది. వీరితో పాటుగా గ్రీవెన్స్ లు నమోదు చేసి అర్హత కలిగిన వారికి కూడా నగదు జమ చేసింది.
అయితే ఈ పథకానికి సంబంధించి షెడ్యూల్ కులాలు కి సంబంధించి కొంత మంది లబ్ధిదారులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కీలక ప్రకటన చేసింది. వీరికి సంబంధించి కేంద్ర వాటాను మరి కొద్ది రోజులలో జమ చేస్తామని తెలిపారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ Join Our What’sApp Group – Click here
🔥తల్లికి వందనం – SC విద్యార్థుల యొక్క కేంద్రం వాటా మరికొద్ది రోజులలో విడుదల:
- రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ తల్లికి వందనం పథకం కి సంబంధించి కీలక అప్డేట్ విడుదల చేసింది.
- రాష్ట్రంలో ప్రభుత్వ , ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు మరియు కళాశాలలో 9వ తరగతి , 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులకు “తల్లికి వందనం ” పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా వచ్చే 20 రోజుల్లోగా జమ అవుతుంది అని , తల్లి దండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సాంఘీక సంక్షేమ శాఖ తెలిపింది.
- పైన పేర్కొన్న అంశాలకు సంబంధించి రాష్ట్రంలో మొత్తం 3.93 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని , రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 382.66 కోట్ల రూపాయలను జూన్ 12వ తేదీ నుండి విడుదల చేసింది అని డిపార్ట్మెంట్ వారు తెలిపారు.
- 9వ తరగతి మరియు 10వ తరగతి చదువుతున్న ఎస్సీ డే స్కాలర్ విద్యార్థులకు వారి తల్లి అకౌంట్ కి 10,900/-రూపాయలు జమ చేయగా, వసతి గృహ విద్యార్థులకు 8,800/-రూపాయలు జమ చేశారు.
- ఇందులో భాగంగా 5200/- రూపాయల నుండి 10972/-రూపాయలు నేరుగా విద్యార్థుల యొక్క ఖాతాలో జమ చేశారు.
- మిగతా కేంద్రం వాటా మొత్తం నిధులు తల్లి లేదా విద్యార్థి యొక్క ఆధార్ కి లింక్ కాబడిన బ్యాంకు అకౌంట్ కి జమ అవుతాయి.