ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం అమలు అయ్యింది. ఇప్పటికే చాలా మంది లబ్ది దారుల అకౌంట్ లో డబ్బులు జమ అవుతున్నాయి. ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగానే తల్లికి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బులు జమ అవుతున్నాయి. గ్రామ , వార్డు సచివాలయంలలో అర్హత మరియు అనర్హత జాబితాలు ప్రదర్శించారు. అయితే చాలా మంది లబ్ధిదారులు అర్హత కలిగి ఉండి కూడా అనర్హుల జాబితాలో ఉండడం తో వారు ఈ పథకానికి సంబంధించి లబ్ది పొందలేకపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని , వారందరికీ గ్రీవెన్స్ నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
గ్రీవెన్స్ ఎక్కడ నమోదు చేసుకోవాలి ? గ్రీవెన్స్ నమోదు కొరకు అవసరం అయ్యేవి ఏంటి అనే విషయాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ వాట్సాప్ లో తల్లికి వందనం పథకం స్టేటస్ ఇలా చేయండి – Click here
🔥సచివాలయంలలో తల్లికి వందనం పథకం గ్రీవెన్స్ నమోదు చేసుకోవచ్చు :
- లబ్ధిదారులు ఎవరైనా తల్లికి వందనం కి సంబంధించి అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా అనర్హుల జాబితాలో పేరు ఉన్నట్లు అయితే లబ్ధిదారుకు ఆందోళన చెందాల్సిన పని లేదు. వారు ఈ నెల 20 వ తేదీ లోగా మీ యొక్క సొంత గ్రామ వార్డు సచివాలయం నందు గల డిజిటల్ అసిస్టెంట్ / వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారి లాగిన్ నందు గ్రీవెన్స్ నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది మీకు సహకరిస్తారు.
🔥తల్లికి వందనం పథకం గ్రీవెన్స్ ఏ విధంగా నమోదు చేయాలి ? :
- గ్రీవెన్స్ నమోదు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) విడుదల చేసింది.
- ఇందులో ఏ సమస్యకి ఏ విధంగా గ్రీవెన్స్ నమోదు చేయాలి, అవసరమగు అంశాలు ఏమిటి ? వంటి అన్ని అంశాలు ప్రస్తావించారు.
🔥 తల్లికి వందనం పథకం – భూ సమస్య :
తల్లికి వందనం పథకం కి సంబంధించి పల్లం భూమి (Wet land) 3 ఎకరాల లోపు , మెట్ట భూమి ( Dry land) 10 ఎకరాల లోపు కలిగి వుండాలి. అంతకి మించి భూమి ఉన్న వారు సాధారణంగా అనర్హులు అవుతారు. కానీ ల్యాండ్ రికార్డ్ లో వారికి భూమి ఎక్కువ గా ఉండి, వారికి నిజంగా పరిమితికి మించి భూమి లేకపోతే వారు ల్యాండ్ రికార్డ్స్ ను సరిచేసుకోవాలి. ఇందుకు గాను డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్ లో వద్ద గ్రీవెన్స్ నమోదు చేస్తే రెవిన్యూ డిపార్ట్మెంట్ వారు వివరాలు సరి చేస్తారు.
🔥 తల్లికి వందనం పథకం – నాలుగు చక్రాల వాహనం సమస్య :
- తల్లికి వందనం పథకానికి సంబంధించి నాలుగు చక్రాల వాహనం కమర్షియల్ కలిగి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు అవుతారు. టాక్సీ ట్రాక్టర్ కలిగి ఉన్నవారికి మినహాయింపుని ఇచ్చారు.
- అనర్హత జాబితాలో నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నందున అనే కారణంతో అర్హత కలిగి ఉన్నవారు వారికి నిజంగా నాలుగు చక్రాల వాహనం లేకపోయినట్లయితే ముందుగా మీ ఆధార్కు లేదా మీ కుటుంబ సభ్యులకు ఆధారకు ఏదైనా నాలుగు చక్రాల వాహనం లింక్ అయ్యింది లేదో సచివాలయ సిబ్బంది సహకారంతో తెలుసుకోగలరు. ఒకవేళ మీకు సంబంధం లేని నాలుగు చక్రాల వాహనం మీ ఆధార్కి లింక్ అయితే దీనికి సంబంధించి సచివాలయంలో గ్రీవెన్స్ నమోదు చేసుకుంటే సంబంధిత గ్రీవెన్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి చేరి పరిష్కరించబడుతుంది.
🔥తల్లికి వందనం పథకం – ఎలక్ట్రిసిటీ సమస్య :
- అనర్హత జాబితాలో 300 యూనిట్లు పైగా పవర్ వినియోగిస్తునట్లు నమోదు అయితే ముందుగా మీరు లేదా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కి ఏవైనా ఇతర కరెంటు మీటర్లు లింక్ కాబడినట్లయితే అంశాన్ని సచివాలయ సిబ్బందికి దృష్టికి తీసుకుని వెళ్లాలి.
- వారు దీనికి సంబంధించి సర్వీస్ రిక్వెస్ట్ నమోదు చేస్తారు.
- మీ యొక్క సొంత మీటర్ లో సమస్య ఉంటే దానికి సంబంధించి గ్రీవెన్స్ నమోదుకు కూడా ఆప్షన్ ఇచ్చారు.
🔥 ఇన్కమ్ టాక్స్ & అర్బన్ ప్రాపర్టీ & గవర్నమెంట్ ఎంప్లాయ్ సమస్య :
వీటికి సంబంధించి కూడా గ్రీవెన్స్ నమోదు కొరకు అవకాశం ఉంది. అయితే గ్రీవెన్స్ నమోదు చేసిన తర్వాత పై అంశాలకు సంబంధించి ఆన్లైన్ విధానం లో డేటాబేస్ తో పోల్చబడుతుంది. గ్రీవెన్స్ నమోదు దారులు నిజంగా అర్హులు అయితే వారికి డేటా బేస్ ప్రకారం నిర్ధారణ జరుగుతుంది.
🔥గ్రీవెన్స్ నమోదుకు 20 వ తేదీ వరకు అవకాశం:
- తల్లికి వందనం పథకం కొరకు గ్రీవెన్స్ చేసుకొనేందుకు ఈ నెల చివరి వరకు అవకాశం కల్పించారు.
- వీలైనంత త్వరగా సచివాలయం సిబ్బంది సహకారం తో గ్రీవెన్స్ నమోదు చేసుకోండి.
- మీరు నిజంగా అర్హత కలిగి ఉంటే మీకు జూలై 05 వ తేదీన మీకు లబ్ది చేకూరుతోంది.