తల్లికి వందనం తుది జాబితాలో తప్పులు – ఒక కుటుంబానికి 1,56,000/- రూపాయిలు | సచివాలయాల్లో అర్హులు , అనర్హులు జాబితా

తల్లికి వందనం అర్హుల జాబితా 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

తల్లికి వందనం పథకం కి సంబంధించి లబ్ధిదారులు అర్హుల , అనర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయం లలో ప్రదర్శించబడ్డాయి. అయితే కొన్ని చోట్ల ఈ జాబితా లలో తప్పులు దొరికినట్లు తెలుస్తుంది.

ఈ అంశాలకు సంబంధించి, ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ ఒక ప్రకటన చేసింది. తల్లికి వందనం పథకం కి సంబంధించి పాఠశాల విద్యా శాఖ యొక్క ప్రకటన యొక్క సారాంశం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

వాట్సాప్ ద్వారా తల్లికి వందనం స్టేటస్ తెలుసుకోండి – Click here

🔥 గ్రామ, వార్డు సచివాలయం లలో తల్లికి వందనం అర్హుల , అనర్హుల జాబితాలు :

  • తల్లికి వందనం పథకం కి అర్హత కలిగిన వారందరికీ డబ్బులు విడుదల చేశామని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది.
  • తల్లికి వందనం పథకం యొక్క అర్హుల మరియు అనర్హుల జాబితాలను సంబంధిత గ్రామ వార్డు సచివాలయం లలో ప్రదర్శించడం జరిగింది.
  • ప్రాథమికంగా అర్హత కలిగి ఉండి , అనర్హుల జాబితాలో ఉన్న వారు తమ యొక్క వివరాలను గ్రామ వార్డు సచివాలయం యొక్క వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
  • దరఖాస్తు దారుల పిర్యాదులను పరిశీలించి , వాస్తవంగా వారు అర్హులు అయితే వారికి లబ్ది చేరేందుకు చర్యలు తీసుకుంటామని తెలియచేసారు.
  • ఆరుగురు అంతకంటే ఎక్కువ మంది వున్న పిల్లలు కలిగి వున్న తల్లుల విషయంలో వారి జాబితాను పునః పరిశీలించి వారికి ఈ పథకం లబ్ది చేకూర్చనున్నారు.
  • అలానే తల్లిదండ్రులు లేని పిల్లలు కి సంబంధించి నగదును జిల్లా కలెక్టర్ గారు యొక్క బ్యాంకు ఖాతా కు డబ్బులు జమ చేసి , క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత వారికి తల్లికి వందనం పథకం లబ్ది చేకూరుస్తామని తెలియచేశారు.

🔥 తుది జాబితాలలో లోపాలు – సరిదిద్దుతున్న అధికారులు :

  • పథకానికి సంబంధించి లబ్ది దారులకు డబ్బులు జమ అవుతున్నాయి. ఇదిలా ఉంటే సచివాలయం లలో గల జాబితాలో తప్పులు దొరికినట్లు తెలుస్తుంది.
  • రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పొరపాట్లు జరిగినట్లు గుర్తించిన అధికారులు వాటిని సరిచేస్తున్నారు.
  • నంద్యాల జిల్లాలో గల ప్యాపిలి సచివాలయంలో ప్రదర్శించిన మొత్తం జాబితాలో 192 మంది కి తల్లి కాలమ్ లో కేవలం ఇద్దరి పేర్లు చూపించడం విస్మయం కి గురిచేస్తుంది.
  • ప్యాపిలి సచివాయలం -03 లో ధర్మవరం మౌనిక కి 96 మంది పిల్లలు గా చూపించగా , సచివాలయం – 04 లో 96 మంది పిల్లలుగా చూపించారు. అలానే డోన్ సచివాలయం లో కూడా తప్పులు దొర్లాయి.
  • ఈ అంశంపై నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు ఆ జాబితాలో తప్పుల గురించి రాష్ట్ర స్థాయి అధికారులకి పిర్యాదు చేయడం జరిగింది.
  • రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 117739 విద్యార్థుల వివరాలలో తప్పులు గుర్తించిన అధికారులు , 83325 మంది వివరాలను సరిచేశారు. మిగిలిన వారి వివరాలు వీలనంత త్వరగా సరిచేస్తామని వివరించారు.

తల్లికి వందనం పథకం – ఆనందంలో లబ్ధిదారులు :

తల్లికి వందనం పథకంకు అర్హులైన వారి అకౌంట్స్ లో రాష్ట్ర ప్రభుత్వం నుండి డబ్బులు జమ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా అర్హులైన వారి అకౌంట్లో డబ్బులు జమ చేయడం కారణంగా విద్యార్థులు చదువుకు ప్రభుత్వం ఆర్థికంగా సహాయపడింది. 

ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలల్లో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు ఉన్న తల్లుల అకౌంట్స్ లో ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకం డబ్బులు జమ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే.

ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు ఇస్తామని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో స్పష్టం చేయడం జరిగింది. టిడిపి సోషల్ మీడియా విభాగం ఈ పథకం ద్వారా అధికంగా లబ్ధి పొందిన వారి సమాచారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అందులో కొన్ని వివరాలు క్రింద ఇవ్వబడినవి

అన్నమయ్య జిల్లా కలకడ మండలంలోని ఒక ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు తల్లులకు, వారి 12 మంది పిల్లల చదువుల నిమిత్తం ‘తల్లికి వందనం’ కింద ఏకంగా రూ.1.56 లక్షలు జమ అయ్యాయి. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు తమ ఖాతాల్లో జమ కావడంతో ఆ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆ తల్లులు సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ తల్లులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదే తరహాలో, కర్నూలు జిల్లా దేవనకొండకు చెందిన చాంద్‌బాషా, షకినాబి దంపతుల కుటుంబం కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందింది. వారికి ఆరుగురు కుమార్తెలు ఉండగా, వారందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసిస్తున్నారు. ‘తల్లికి వందనం’ పథకానికి వీరంతా అర్హత సాధించడంతో, వారి తల్లి షకినాబి ఖాతాలో ఇప్పటివరకు రూ.78,000 జమ అయ్యాయని విద్యార్థుల తండ్రి చాంద్‌బాషా సంతోషం వ్యక్తం చేశారు.

Note :

ప్రతి రోజు మీ మొబైల్ కు వివిధ ప్రభుత్వ పథకం వాట్సాప్ ద్వారా రావాలి అంటే క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూప్ లో ఉచితంగా వెంటనే జాయిన్ అవ్వండి..

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!