ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పథకంలో స్పౌజ్ కేటగిరి క్రింద పెన్షన్ దరఖాస్తుల ఆహ్వానం | NTR BHAROSA PENSION SCHEME

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పథకంలో స్పౌజ్ క్యాటగిరి పెన్షన్లు
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పెన్షన్ పొందాలి అనుకుంటున్న వారికి వితంతువులు కి శుభవార్త తెలియజేసింది దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. స్పౌజ్ (Spouse) కేటగిరి క్రింద వితంతువులు కి పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇందు కొరకు గ్రామ, వార్డ్ సచివాలయం సిబ్బంది ద్వారా సర్వే చేయనుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పథకం (NTR Bharosa Pension Scheme) ద్వారా వివిధ కేటగిరీల వారికి పెన్షన్లు అందజేస్తుంది.2023 డిసెంబర్ నుండి పెన్షన్ పొందుతూ భర్త చనిపోతే భార్యలకు పెన్షన్లు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం , ఇప్పుడు మరో ముందడుగు వేసి , 2019 నుండి 2023 నవంబర్ వరకు ఎవరైనా పెన్షన్ దారులు చనిపోయారో వారి భార్యలకు పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

AP లో పదో తరగతి అర్హతతో 1294 ఆశా వర్కర్ ఉద్యోగాలు – Click here

🔥ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పథకం లో స్పౌజ్ క్యాటగిరీ కింద నూతన పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటుంది.
  • సూపర్ సిక్స్ పథకాల ను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం ద్వారా గతంలో ఉన్న మొత్తం కంటే ఎక్కువ పెన్షన్ మొత్తాన్ని పెన్షన్ దారులకు అందిస్తుంది.
  • గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ ఫంక్షన్ పంపిణీ చేస్తూ ప్రశంసలు పొందుతుంది.
  • ఇప్పుడు స్పాంజ్ కేటగిరీ కింద 2019 నుండి 2023 నవంబర్ వరకు ఎవరైతే పెన్షన్ పొంది మరణించారో వారి భార్యలకు పెన్షన్ మంజూరు చేసేందుకు గాను కార్యక్రమాన్ని ప్రారంభించింది.
  • ఇప్పటికే గ్రామ అవార్డు సచివాలయం సిబ్బందికి ఈ అంశంపై ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
  • ఈనెల 30వ తేదీలోగా ఈ సర్వేను పూర్తి చేయాలని నిర్ణయించారు అధికారులు.

🔥ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పథకం స్పౌజ్ పెన్షన్ పొందేందుకు సర్వే ఏవిధంగా చేస్తారు ? అవసరమగు వివరాలు ఏమిటి ? :

  • ఈ సర్వే మొత్తం ఆన్లైన్ విధానంలో చేయడం జరుగుతుంది.
  • గ్రామా వార్డు సచివాలయ సిబ్బంది ఫంక్షన్ పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ నందు capture wife details అని టాబ్ ప్రొవైడ్ చేయడం జరిగింది.
  • ఇందులో 2019 నుండి 2023 నవంబర్ వరకు మరణించిన పురుషుల వివరాలు డిస్ప్లే కాబడతాయి.
  • వారి పెన్షన్ ఐడి వారి ఆధార్ నెంబర్, వారి వయస్సు ,పేరు మొదలగు వివరాలు అన్ని అందులో పొందుపరిచి ఉన్నాయి.
  • సచివాలయ సిబ్బంది యాప్ నందు నమోదు కాబడిన వ్యక్తుల య భార్య వివరాలను గుర్తించి నమోదు చేస్తారు.
  • సచివాలయ సిబ్బంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారిని సంప్రదించి వివరాలను అడుగుతారు.
  • భార్య యొక్క ఆధార్ నెంబరు మరియు ప్రస్తుతం పని చేస్తున్న ఫోన్ నెంబరు అప్ లో నమోదు చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది.
  • తర్వాత అధికారుల నుండి వచ్చే సమాచారం ఆధారంగా వీరి పెన్షన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయబడుతుంది.
  • ఎవరైనా స్పౌజ్ కేటగిరీ కింద పెన్షన్ పొందాలి అనుకుంటున్నారు మీ దగ్గరలో గల గ్రామా మరియు వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించగలరు.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *