ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అన్ని అంశాలను పరిగణన లోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేయబోతుంది ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే దిశగా, ఎవరికి ఇటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. మహిళలకు కల్పించబోయే ఉచిత బస్ ప్రయాణం పథకం సమీక్ష లో భాగంగా ఆర్టీసీ ఎండి తిరుమల రావు గారు కీలక ప్రకటన చేశారు. ఉచిత బస్సు ప్రయాణం నిమిత్తం ప్రభుత్వం చే గుర్తింపబడిన ఏదైనా ఒక ఐడి కార్డు ఉంటే చాలని తెలిపారు.
ఈ పథకం అమలు కొరకు డిపో మేనేజర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్టీసీ ఎండి తిరుమల రావు గారు మరిన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. ఈ అంశాల కొరకు ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
🔥 ఉచిత బస్సు ప్రయాణం కొరకు ప్రభుత్వ ఐడి కార్డ్ సరిపోతుంది:
- రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత పథకం వినియోగించుకునేందుకు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది అని తిరుమల రావు గారు తెలిపారు. కాబట్టి మహిళలు తమ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వంటి ఐడి కార్డులతో బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
- రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావడమ లక్ష్యంగా మహిళా అభివృద్ధికి మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారని ఇందులో భాగంగానే ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారని తెలిపారు.
✅ ఆగస్ట్ 25 నుండి రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ – Click here
🔥రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడికైనా మహిళలకు ఉచితంగానే బస్సు ప్రయాణం :
- రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో మహిళలకు బస్సు ప్రయాణం కల్పించేందుకు నిర్ణయం తీసుకుందని ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎక్కడ నుండే ప్రయాణం చేసేందుకు గాను ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
- అందుబాటులో ఉన్న పల్లె వెలుగు, ఎక్స్ప ప్రెస్ లతో పాటు నగరాలలో గల మెట్రో ఎక్స్ప్రెస్ మరియు సిటీ ఆర్డినరీ బస్సులలో కూడా ప్రయాణించవచ్చని తెలిపారు.
- మరికొద్ది రోజుల్లో ఈ పథకం మార్గదర్శకాలు విడుదల కానున్నాయని, రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ భేటీ అనంతరం అధికారిక ఉత్తర్వులు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.