ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం | వీరికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాలు
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక అంశాలను పరిగణించి , అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది. అలానే విద్యా రంగానికి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకు వచ్చింది. మరియు విద్యా రంగంలో కూడా వివిధ సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తుంది.

ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి శ్రీ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గారు ప్రకటించారు.

ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🏹 ఇలాంటి వివిధ పథకాల సమాచారం మీ మొబైల్ కి రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి..

🔥అనారోగ్యం తో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం :

  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వారు కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
  • రాష్ట్రంలో చదువుతూ అనారోగ్య కారణాల చేత చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.
  • మంత్రి గారు ఇటీవల నిర్వహించిన సాంఘిక సంక్షేమ శాఖా సమీక్ష లో భాగంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

🔥ఇతర అంశాలు :

  • మంత్రి గారు నిర్వహించిన సమీక్షా సమావేశం లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా అనేక విషయాలు ప్రస్తావించారు .
  • రాష్ట్రంలో గురుకులాలు మరియు రెసిడెన్షియల్ హాస్టల్స్ లలో ప్రవేశాలు పెరగాలని తెలిపారు.
  • రెసిడెన్షియల్ హాస్టల్స్ మరియు గురుకులాలు లో చదువుతున్న విద్యార్థులు ఆరోగ్యం మరియు భద్రతా అంశాలు పై ప్రతెక్య శ్రద్ధ తీసుకోవాలి అని అన్నారు.
  • వారికి ఆరోగ్యం , భద్రత మరియు పోషకాహారం పై రాజీ పడరాదు అని తెలిపారు.
  • అలానే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన మరియు లీడ్ క్యాంప్ వంటి వివిధ అంశాలపై సమీక్షించారు.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *