ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు నెలలో పలు సంక్షేమ పథకాలు అమలు కానున్నాయి. ఈ సంక్షేమ పథకాల ద్వారా రైతులకు , మహిళలకు , ఆటో డ్రైవర్లకు , వితంతువులకు మొదలగు వారికి ఆగస్టు నెలలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఈ సంక్షేమ పథకాలు తో పాటు ఆగస్టు 15 నాటికి P4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలు దత్తత తీసుకొని , వారికి కూడా సహాయం చేయనున్నారు.
ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
✅ పదో తరగతి అర్హతతో 4,987 ఉద్యోగాలు – Click here
🔥 ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 01 న లక్ష మందికి పైగా నూతన పెన్షన్లు పంపిణీ :
- రాష్ట్రంలో NTR భరోసా పెన్షన్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ దారులకు ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా లక్ష మందికి పైగా వితంతువులకు పెన్షన్లు మంజూరు చేసింది.
- వీరి అందరికి కూడా ఆగస్టు 01 వ తేదీన 4,000/- రూపాయలు చొప్పున పెన్షన్ అందిస్తారు.
- ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన కూడా విడుదల అవ్వడం తో నూతనంగా పెన్షన్ అందుకొనే పెన్షన్ దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
🔥ఆగస్టు 02 న ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం :
- సూపర్ సిక్స్ లో ఒక ప్రధాన పథకం అయిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 02 వ తేదీన అమలు చేయనుంది.
- అన్నదాత సుఖీభవ పథకం కి సంబంధించి , దరఖాస్తు ప్రక్రియ & అర్హుల జాబితా కూడా తయారు అయిపోయింది.
- అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 5000/- రూపాయలు & పీఎం కిసాన్ ద్వారా 2000 రూపాయలు మొత్తం 7000/- రూపాయలను ఆగస్టు 02 మరియు 03 వ తేదీలలో జమ చేస్తామని వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
🔥 ఆగస్టు 15 న మహిళలకు ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్ ప్రయాణం & P4 కార్యక్రమం:
- RTC బస్ లలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం , మహిళలు ఎంతగానో ఎదురుచూస్తున్న పథకం.
- మహిళలకు సంబంధించిన పథకం కావడంతో ఈ పథకం అమలు లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని , ఇతర రాష్ట్రాలలో అమలు కాబడుతున్న ఈ పథకం ను కూడా పరిశీలించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ పథకం అమలు చేయనున్నారు.
- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 రకాల బస్ లలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు.
- ఈ పథకాన్ని జిల్లా పరిధి వరకు పరిమితం చేస్తారా లేదా రాష్ట్రం మొత్తానికి విస్తరిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
- ఆగస్టు 15 నుండి అమలు కానున్న ఈ పథకం కి సంబంధించి మార్గదర్శకాలు మరి కొద్ది రోజులలో విడుదల కానున్నాయి.
🔥ఆగస్టు నెల లో ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం:
- రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం అమలు చేస్తే ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బ తింటుంది అన్న వాదన కూడా ఉంది.
- ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలన చేసింది.
- ఆటో డ్రైవర్ లకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించడం తో ఆటో డ్రైవర్లు కూడా ఈ పథకం అమలును స్వాగతించే అవకాశం ఉంది.
- ఆటో డ్రైవర్లకు కూడా ఆగస్టు 15 వ తేదీ నాడే ఆర్థిక సహాయం అందించేందుకు అవకాశం ఉంది.
- ఆగస్టు నెలలో పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం తో పాటు రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కొరకు P4 కార్యక్రమం ను కూడా ప్రారంభించింది. P4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శులు మరియు బంగారు కుటుంబాలు ఎంపిక కూడా జరుగుతుంది.