సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్రంలో గల 46.86 లక్షల మంది రైతుల ఖాతాలలో 3174.43 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. అన్నదాతల కుటుంబాలలో ఆనందమే కూటమి ప్రభుత్వానికి ఆశీర్వచనం అని భావిస్తూ ఈ పథకాన్ని ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో లాంచ్ చేయబోతున్నారు.
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హత కలిగిన రైతులందరికీ 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తారు అన్న విషయం తెలిసినది.
ఈ పథకానికి సంబంధించి మరింత సమాచారం కొరకు ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents :
డ✅ డిగ్రీ అర్హతతో 10,277 బ్యాంక్ ఉద్యోగాలు – Click here
🔥అర్హత కలిగిన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అందించనుంది. ఇందులో భాగంగా ఈరోజు ఆగస్టు 2వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో భాగంగా 7వేల రూపాయలను అన్నదాత సుఖీభవ పథకంతో పాటుగా పీఎం కిషన్ పథకాన్ని అమలు చేస్తూ రైతులు ఖాతాల్లో జమ చేయనుంది.
- అర్హత కలిగిన రైతుల పేర్లు అందరివి కూడా అర్హుల జాబితాలో ఉండాలని స్వయంగా ముఖ్యమంత్రి గారు తెలిపారు.
- అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46,85,838 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రతి సంవత్సరం వీరికి 20 వల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం లభిస్తుందని తెలిపారు.
- మొదటి విడుదల భాగంగా 7000/- రూపాయలను అందిస్తున్నామని తెలిపారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం 2342.92 కోట్లు మరియు కేంద్ర ప్రభుత్వం 831.51 కోట్లు కేటాయించాయని అన్నారు.
- అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులు జాబితాలో పేర్లు లేనట్లయితే వారు టోల్ ఫ్రీ నెంబర్ 155251 కు ఫోన్ చేసి ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
✅ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఈ ఐడి కార్డులు తప్పనిసరి – Click here
🔥 అన్నదాత సుఖీభవ మార్గదర్శకాలు జారీ :
- అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.
- లబ్ధిదారుల ఎంపిక, నిధుల మంజూరుకు సంబంధించి ఈ అంశంలో స్పష్టంగా తెలియజేశారు
- కుటుంబాన్ని యూనిట్ గా చేసుకొని అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ద్వారా మూడు విడతలలో 20 వేల రూపాయలను లబ్ధిదారులకు జమ చేస్తారు.
- ఖరీఫ్ సాగుకు అనుగుణంగా ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలు & పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 2000/- రూపాయలను లబ్దివరం ఖాతాల్లో జమ చేయనుంది.
- రెండు విడతలో రవి సాగుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 5000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం & పీఎం కిసాన్ పథకం ద్వారా 2000/- రూపాయలను లబ్ధిదారులు ఖాతాలకు జమ చేస్తారు.
- మూడో విడతలో భాగంగా మొత్తం 6000/- రూపాయలను లబ్ధిదారులు యొక్క ఖాతాలలో జమ చేస్తారు ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 2000/- రూపాయలు కాగా. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు జమ చేస్తుంది.
🔥 అన్నదాత సుఖీభవ పథకం వీరికి తాత్కాలికంగా నిలుపుదల:
- రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం అమలవుతున్నప్పటికీ రాష్ట్రంలో కొన్నిచోట్ల ఎన్నికలు నిర్వహిస్తున్న కారణంగా ఆ ప్రాంతాలలో లబ్ధిదారులకు అన్నదాత సుఖీభవ పథకం తాత్కాలికంగా నిలుపుదల చేయనున్నారు.
- కడప పులివెందుల రెవెన్యూ డివిజన్లో పాటు రాష్ట్రంలో గల మరో మూడు మండలాలు రెండు గ్రామాలలో ఎన్నికలు నిర్వహిస్తున్నందున వీరికి అన్నదాత సుఖీభవ పథకం నగదు జమ చేయవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.
- అయితే వీరికి గతం నుండి అమలులో ఉన్న పీఎం కిసాన్ 20వ విడత నిధులు జమ చేయవచ్చని తెలిపారు.
- ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ ప్రాంత లబ్ధిదారులకు అన్నదాత సుఖీభవ పథకం నగదు జమ అవుతుంది.