ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ,వెరిఫికేషన్ ప్రక్రియ, అన్ని పూర్తయి లబ్ధిదారులు జాబితాలను కూడా తయారు చేశారు.
🏹 పదో తరగతి అర్హతతో 1075 ఉద్యోగాలు – Click here
Annadata Sukhibava Scheme 2025 :
ఈనెల చివరి లోపు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. లబ్ధిదారులు 90 శాతానికి పైగా ఈ కేవీసీ పూర్తయిందని, కౌలు రైతులు CCRC కార్డులను తీసుకోవాలని సూచించారు.
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🏹 ప్రతీ రోజూ వివిధ ప్రభుత్వ పథకాల సమాచారం మీ మొబైల్ లో వాట్సాప్ కి రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ గ్రూపులో ఉచితంగా జాయిన్ అవ్వండి.
🔥మూడు విడతల్లో 20,000 రూపాయల లబ్ది :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర పథకమైన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం తో పాటుగా అమలు చేయాలని నిర్ణయించింది..
- పీఎం కిసాన్ పథకం ఈనెల 20వ తేదీన అమలు చేస్తారని భావించినప్పటికీ ఈ పథకం అమలు వాయిదా పడడంతో అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా వాయిదా వేశారు.
- ఈ నెలాఖరులోగా ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించడంతో అన్నదాత సుఖీభవ పథకం కూడా ఈ నెలాఖరులోగా పిఎం కిసాన్ నిధులు విడుదల చేసే తేదీని అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా రైతులకు జమ చేస్తారు.
- మొత్తం మూడు విడతలలో రైతులకు లబ్ధి చేకూరనుంది. మొదటి విడతలో భాగంగా ఈనెల జూన్ నెల ఆఖరి లోగా 7000 రూపాయలు , రెండో విడతగా అక్టోబర్ నెలలో మరో ఏడు వేల రూపాయలు , మూడో విడతగా 2026 జనవరిలో 6000 రూపాయలు రైతులకు జమ చేస్తారు.
🔥పథకం పొందాలంటే ఇవి తప్పనిసరి :
- అన్నదాత సుఖీభవ పథకంతో పాటుగా పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకున్న రైతులు తప్పనిసరిగా వారి బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ అనగా NPCI పూర్తి చేసుకొని వుండాలి.
- అలానే ఈ పథకానికి సంబంధించి ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి.
- రాష్ట్ర ప్రభుత్వం EKYC నమోదు ప్రక్రియను ఆటోమేటిక్ విధానం ద్వారా పూర్తిచేసింది. అయితే చాలా కొద్ది మొత్తంలో లబ్ధిదారులు EKYC నమోదు కొరకు పెండింగ్ ఉన్నారు వారు కూడా వీలైనంత త్వరగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాలి.
- పీఎం కిసాన్ కి సంబంధించి పీఎం కిసాన్ యొక్క అధికారిక వెబ్సైట్లో ఈకేవైసి నమోదు చేసుకోవచ్చు.
- భూమి కలిగిన లబ్ధిదారులు అందరూ E-KYC లో నమోదు అయి ఉండాలి.
🔥90 శాతం లబ్ధిదారుల EKYC పూర్తి , కౌలు రైతులు ఇలా చేయండి :
- అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
- ఈ పథకానికి సంబంధించి 90% లబ్ధిదారులు EKYC పూర్తి చేసుకున్నారని ప్రకటించింది.
- పెండింగ్ లో ఉన్నవారు గ్రామస్థాయిలో గల రైతు సేవా కేంద్రం నందు గల సిబ్బందిని సంప్రదించి ఈకేవైసీ నమోదు చేసుకోవాలని సూచించారు.
- భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ కౌలు రైతులు రెవిన్యూ డిపార్ట్మెంట్ అధికారులను సంప్రదించి CCRC కార్డులను పొందాలని ఈ కార్డు ఉంటేనే ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారని తెలియజేశారు. ఈ పంటలో కూడా నమోదవ్వాలని తెలిపారు.
- కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే 20 వేల రూపాయల లబ్ది చేకూర్చుతుంది.
- ఈ పథకానికి గాను డి పట్టా భూమి కలిగిన వారు , ఇనాం భూమి కలిగిన వారు, అసైన్డ్ భూమి కలిగిన వారు లబ్ధి చేకూరాలి అంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించాలి.