ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకంతో మొత్తం 7000 రూపాయలను లబ్ధిదారులు ఖాతాలలో జమ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని కౌలు రైతులకు కూడా శుభవార్త తెలియజేసింది. వీరికి కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ది చేకూర్చుతామని తెలిపింది. వీరికి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే 20,000/- రూపాయలను అందిస్తుంది.
🔥 కౌలు రైతులకు అక్టోబర్ నెలలో అన్నదాత సుఖీభవ:
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది. వీరికి కూడా అన్నదాత సుఖీభవ పథకం సదుపాయం కల్పించింది.
- అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కౌలు రైతులకు ఒక సంవత్సరం కి 20,000/- రూపాయలు అందించనున్నారు.
- క్రాప్ కల్టివేటెడ్ రైట్స్ కార్డ్ (CCRC) కలిగి వున్న భూమి లేని కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం నగదు అక్టోబర్ నెలలో విడుదల చేస్తామని వ్యవసాయ శాఖా డైరెక్టర్ ఢిల్లీ రావు గారు తెలిపారు.