ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధాన పథకం అయిన అన్నదాత సుఖీభవ పథకం ను రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో అమలు చేయనుంది.
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటికీ అర్హులు గుర్తింపు , వెరిఫికేషన్ , ఈ కేవైసీ నమోదు వంటివి ఇప్పటికే పూర్తి కాగా అర్హుల జాబితాను విడుదల చేసినట్లు అధికారులు తెలియజేశారు.
అలానే అర్హత జాబితాలో లేని వారి కోసం గ్రీవెన్స్ నమోదు చేసేందుకు గాను అవకాశం కూడా కల్పించి ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 అన్నదాత సుఖీభవ పథకం అర్హులు జాబితా విడుదల :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలో అమలు చేయనుంది.
- ఈ పథకానికి సంబంధించి అర్హత కలిగిన రైతుల జాబితాను సంబంధిత రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది.
- ఇందుకు సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖ సంచాలకులు ఢిల్లీ రావు గారు తెలియజేశారు.
- రైతులందరూ తమ రైతు సేవా కేంద్రాలలో అర్హులు జాబితాను వెరిఫై చేసుకుని లిస్టులో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. లిస్టులో పేరు లేకపోతే ఈనెల 13వ తేదీలోపు గ్రీవెన్స్ పెట్టుకోవాలి.
🏹 తల్లికి వందనం రెండో విడత లిస్ట్ – Click here
🔥 అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ ఈ విధంగా కూడా తెలుసుకోవచ్చు :
- అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులు జాబితాలో ఉన్నారో లేదో అనే అంశాన్ని రైతు సేవ కేంద్రాల్లో గల అర్హత జాబితాలతో పాటుగా ఆన్లైన్ విధానం ద్వారా తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు.
- లబ్ధిదారులు మనమిత్ర వాట్సప్ నెంబర్ ద్వారా మరియు అన్నదాత సుఖీభవ అధికారిక పోర్టల్ ద్వారా కూడా అర్హత స్టేటస్ తెలుసుకునేందుకు అవకాశం ఉంది.
- మన మిత్ర వాట్సాప్ సర్వీస్ లో అన్నదాత సుఖీభవ సర్వీస్ ఎంచుకొని చెక్ స్టేటస్ పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీరు అర్హులు కాదో అన్న అంశాన్ని వాట్సాప్ మెసేజ్ ద్వారా ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది.
- అలానే అధికారిక పోర్టల్ లో కూడా ఆధార్ నెంబర్ ను నమోదు చేసి మీరు ఈ పథకానికి అర్హులా కాదా ఈ కేవైసీ నమోదయిందా లేదా అన్న అంశాన్ని తెలుసుకోవచ్చు.
🏹 Check Annadhata Sukhibava Status – Click here
- మీకు అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ చెక్ చేయడం రాకపోతే మీకు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో ఆధార్ కార్డుతో వెళ్లి సంప్రదించండి.
🔥 గ్రీవెన్స్ నమోదుకు 13వ తేదీ వరకు అవకాశం :
- అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉండి జాబితాలో పేరు లేని వారికి గ్రీవెన్స్ నమోదు చేసేందుకు గాను అవకాశం కల్పించారు.
- రైతు పేరు జాబితాలో లేనప్పటికీ అర్హులు అని భావిస్తే రైతు సేవా కేంద్రంలో గల వ్యవసాయ సహాయకులకు అర్జీతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను అందజేయాలి.
- అన్నదాత సుఖీభవ పోర్టల్ లో గ్రీవెన్స్ నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
- ఈనెల 13వ తేదీ వరకు అనగా మరో ఐదు రోజులు పాటు గ్రీవెన్స్ నమోదుకు అవకాశం ఉంటుంది.
- ఈ సమాచారాన్ని అంతా రైతులకు చేరవేసే విధంగా ముమ్ముర ప్రచారం చేయాలని వ్యవసాయ శాఖ సంచాలకులు ఢిల్లీ రావు గారు పేర్కొన్నారు.