రైతులకు శుభవార్త ! రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సొంత భూమి కలిగిన రైతులకు మరియు కౌలు రైతులకు కూడా లబ్ది చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు తేదీ ను ప్రకటించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ” సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో పాల్గొని , ఈ అంశాన్ని ప్రకటించారు.
పూర్తి వివరాలు కొరకు ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ AP లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు 7,000/- రూపాయలు జమ ఆగస్టు 2 & 3 తేదిన :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు తేదీ ను ప్రకటించింది.
- కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ పథకం తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000/- రూపాయలు ఆర్థిక లబ్ది చేకూర్చనున్న ఈ పథకం సూపర్ సిక్స్ పథకాలలో భాగం కావడం తో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకం అమలు కి అధిక ప్రాధాన్యత ఇస్తుంది.
- ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముగిసింది. ఎవరైనా అర్హత కలిగి అర్హుల జాబితాలో లేకపోతే వారికి గ్రీవెన్స్ నమోదు కొరకు కూడా అవకాశం కల్పించారు.
- అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హత కలిగిన రైతులకు ఆగస్టు 02 & 03 వ తేదీన నగదు జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు అధికారికంగా ప్రకటించడం తో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- ఈ పథకంలో భాగంగా తొలి విడత గా కేంద్ర ప్రభుత్వం యొక్క 2,000/- రూపాయలు తో పాటు రాష్ట్ర ప్రభుత్వం 5,000/- రూపాయలు మొత్తం 7,000/- రూపాయలు లబ్ధిదారులకు జమ చేస్తారు.