మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై CM గారు కీలక ప్రకటన , ఆ తేది నుండే అమలు | Free bus journey to women | AP

ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించే తేదీ గా ఆగస్టు 15 ను తెలిపింది.

ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేయడం రాష్ట్రానికి ఆర్థిక భారం అయినా సరే ఆగస్టు 15 నుండి కచ్చితంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు.

గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించిన వివిధ అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥ఆర్థిక భారం అయినా ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం :

  • ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మహిళలు కు ఆగస్టు 15 నుండి ఉచిత బస్ ప్రయాణం పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పునరుద్ఘాటించారు.
  • ఈ పథకం అమలు కొరకు ఆర్థిక భారం అయినా చెప్పిన తేదీకి కచ్చితంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు తెలియచేసారు.
  • ఇందుకు గాను ఆక్యుపెన్సీ కి తగినట్లుగా బస్ లను కొనుగోలు చేసేందుకు నిర్ణయించామని చెప్పారు.

🏹 6,238 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here

🔥మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం RTC లో ఎలెక్ట్రిక్ బస్ లు :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (APSRTC) లో ఇక నుండి ఎలెక్ట్రిక్ వెహికల్స్ ప్రవేశ పెడతామని ముఖ్యమంత్రి గారు తెలియచేసారు.
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కి మరియు , బస్ ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా 2,536 బస్ లు అవసరమవుతాయి.
  • రాష్ట్ర ప్రభుత్వం కొత్త బస్ ల కొనుగోలు కొరకు సుమారు రూ.996 కోట్లు ఖర్చు పెట్టనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!