నిరుద్యోగులకు శుభవార్త ! రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నిరుద్యోగ భృతి పథకం అమలు పై కీలక అప్డేట్ వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలలో గరిష్ఠంగా పథకాలు అమలు కాగా మరికొద్ది రోజులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కూడా అమలు అవ్వనుంది.
అదే విధంగా నిరుద్యోగులు ఎంత గానో ఎదురు చూస్తున్న నిరుద్యోగ భృతి పథకం కూడా అమలు చేయనున్నారు.
ఈ పథకం అమలు కి సంబంధించి మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🏹 AP లో ఆగస్ట్ లో అమలు చేసే పథకాలు ఇవే – Click here
🔥 ఈ సంవత్సరం చివరిలో నిరుద్యోగ భృతి అమలు :
- రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతిని అమలు చేస్తుంది అని గిద్దలూరు MLA అశోక్ రెడ్డి తెలిపారు.
- డిగ్రీ ఉత్తీర్ణత సాధించి రెండేళ్ల లోపు ఉద్యోగం రాకపోతే వారికి నిరుద్యోగ భృతి పథకం కింద నెలకు 3,000/- రూపాయలు అందిస్తామని చెప్పారు.
- నిరుద్యోగ భృతి ఈ సంవత్సరం చివరి నుండి అమలు చేస్తామని ప్రకటించారు.
- రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక యువతకు అనేక ఉపాధి అవకాశాలు కల్పించామని , యువతకు ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది అని అన్నారు.
- రాష్ట్రంలో నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలకు మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతూ ఉంటారు. వీరు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించే నిరుద్యోగ భృతి ఆర్థిక సహాయం అందిస్తుంది.