పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 350 ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ | Punjab National Bank Specialist Officer Notification 2025 | Latest Bank Jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారతదేశంలోని ప్రముఖ వాణిజ్య బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సంస్థ నుండి వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8 రకాల పోస్ట్లు, 350 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అర్హతలు ,వయస్సు ,  దరఖాస్తు విధానం , ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🏹 10+2 అర్హతతో గుమస్తా ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • 350 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు , ఖాళీల వివరాలు

  • ఆఫీసర్ క్రెడిట్ – 250
  • ఆఫీసర్ ఇండస్ట్రీ – 75
  • మేనేజర్ ఐటీ – 05
  • సీనియర్ మేనేజర్ ఐటీ – 05
  • మేనేజర్ డేటా సైంటిస్ట్ – 03
  • సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్ – 02
  • మేనేజర్ సైబర్ సెక్యూరిటీ – 05
  • సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ – 05

🔥 విద్యార్హత:

పోస్ట్ పేరు విద్యార్హతవయస్సు
ఆఫీసర్ ( క్రెడిట్)CA లేదా ICWA లేదా CFA ఉత్తీర్ణత లేదా 60 శాతం మార్కులతో ఎంబీఏ / మేనేజ్మెంట్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఉత్తీర్ణత 21- 30
ఆఫీసర్ (ఇండస్ట్రీ) సివిల్ / ఎలక్ట్రికల్ / మెకానికల్ / టెక్టైల్/ మైనింగ్ / కెమికల్ / ప్రొడక్షన్ / మెటలర్జీ/ ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో 60 శాతం మార్కులతో బి.ఈ లేదా బి. టెక్ ఉత్తీర్ణత21-30
మేనేజర్ ( ఐటీ) కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో 60 శాతం మార్కులతో  బి. ఈ లేదా బి.టెక్ ఉత్తీర్ణత లేదా MCA ఉత్తీర్ణత సాధించాలి.25-35
సీనియర్ మేనేజర్ ( ఐటీ)కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో 60 శాతం మార్కులతో  బి.ఈ లేదా బి.టెక్ , లేదా MCA ఉత్తీర్ణత సాధించాలి27-38
మేనేజర్ ( డేటా సైంటిస్టు)కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /డేటా సైన్స్ లో 60 శాతం మార్కులతో  బి.ఈ లేదా బి.టెక్ ఉత్తీర్ణత సాధించాలి.25-35
సీనియర్ మేనేజర్ ( డేటా సైంటిస్ట్)కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /డేటా సైన్స్ లో 60 శాతం మార్కులతో  బి. ఈ లేదా బి.టెక్ ఉత్తీర్ణత సాధించాలి.27-38
మేనేజర్ ( సైబర్ సెక్యూరిటీ)కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో 60 శాతం మార్కులతో  బి.ఈ లేదా బి.టెక్ ఉత్తీర్ణత లేదా MCA ఉత్తీర్ణత సాధించాలి25-35
సీనియర్ మేనేజర్ ( సైబర్ సెక్యూరిటీ)కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో 60 శాతం మార్కులతో  బి.ఈ లేదా బి.టెక్ ఉత్తీర్ణత లేదా MCA ఉత్తీర్ణత సాధించాలి27-38

🔥 వయస్సు

  • పోస్టులను అనుసరించి 21 సంవత్సరాల నుండి 38 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.( వయస్సు పరిమితి ఒక్కో పోస్ట్ కి ఒక్కో విధంగా ప్రస్తావించారు , కావున అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్ ను పరిశీలించగలరు).
  • ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ – సర్వీస్ మాన్ వారికి అభ్యర్థులకు 5 సంవత్సరాలు
  • ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు
  • దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో తేది: 03/03/2025 నుండి 24/03/2025 లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులు అభ్యర్థులు GST తో కలిపి 59 /- రూపాయల అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.
  • జనరల్ / EWS / ఓబీసీ అభ్యర్థులు GST తో కలిపి 1180/- రూపాయల అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.

🔥 ఎంపిక విధానం :

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ వ్రాత పరిక్ష ,  పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం:

  • 200 మార్కులకు గాను పరిక్ష నిర్వహిస్తారు.150  ప్రశ్నలకు 120 నిముషాల సమయం కేటాయించారు.
  • ఇందులో రీజనింగ్( 25 ప్రశ్నలకు గాను 25 మార్కులు )  , ఇంగ్లీష్ లాంగ్వేజ్ ( 25 ప్రశ్నలకు గాను 25 మార్కులు ), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్( 50 ప్రశ్నలకు గాను 50 మార్కులు ),ప్రొఫెషనల్ నాలెడ్జ్ ( 50 ప్రశ్నలకు గాను 100 మార్కులు) కేటాయించారు.
  • ప్రతి తప్పు సమాధానానికి గాను ¼ వ వంతు నెగెటివ్ మార్కుల విధానం కలదు.

🔥 ఇంటర్వ్యూ విధానం:

  • ఆన్లైన్ పరీక్ష లు షార్ట్ లిస్ట్ కాబడిన వారికి 50 మార్కులకు గాను పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

🔥 పరీక్ష కేంద్రాలు : 

  • దేశంలోని పలు ప్రముఖ నగరాలతో పాటు   తెలుగు రాష్ట్రాలలో కూడా పలు నగరాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు.
  • ఆంధ్ర ప్రదేశ్ :  గుంటూరు/ విజయవాడ , విశాఖపట్నం కేంద్రాలను ఎంపిక చేశారు.
  • తెలంగాణ : హైదరాబాద్ కేంద్రాన్ని ఎంపిక చేశారు.

🔥 జీతం:

  • అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా ప్రారంభ దశలో నెలకు 50,000/- రూపాయల నుండి 1,00,000/-  రూపాయలు దాటి కూడా జీతం లభిస్తుంది.

🔥 సర్వీస్ బాండ్

  • ఎంపిక కాబడిన అభ్యర్థులు బ్యాంక్ వారి ఆదేశాల మేరకు సర్వీసు బాండ్ కి కట్టుబడి వుండాలి.

 🔥 ముఖ్యమైన తేదీలు:

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది: 03/03/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 24/03/2025

👉  Click here for notification

👉 Click here for official website 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *