TTD సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | SVMC Contract Outsourcing Jobs Recruitment 2025 | Latest jobs Notifications

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలోగల ఈ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్, తిరుపతి నుండి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ప్రాతిపదికన రిక్రూట్ చేస్తున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

మొత్తం 12 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

అనస్తీషియా టెక్నీషియన్ – 01

ల్యాబ్ అటెండెంట్ – 07

డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01

ఎలక్ట్రీషియన్ / మెకానిక్ – 01

మార్చురీ మెకానిక్ – 01

ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ – 01

🔥 విద్యార్హత

అనస్తీషియా టెక్నీషియన్ : అనస్థీషియా టెక్నాలజీలో డిప్లమో ఉత్తీర్ణత సాధించి రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. లేదా అనస్తీషియా టెక్నాలజీలో బిఎస్సి ఉత్తీర్ణత సాధించాలి.

డేటా ఎంట్రీ ఆపరేటర్ : బీఎస్సీ కంప్యూటర్స్, బీకాం కంప్యూటర్స్, బీటెక్ కంప్యూటర్స్ సాధించాలి. లేదా ఏదైనా డిగ్రీ చేసి ఉండి PGDCA ఉత్తీర్ణత సాధించాలి

ఎలక్ట్రీషియన్ / మెకానిక్ : పదవ తరగతి ఉత్తీర్లత సాధించి ఎలక్ట్రికల్ విభాగంలో ఐటిఐ లేదా డిప్లమో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

మార్చురీ మెకానిక్ : LME విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి, డీప్ రిఫ్రిజరేషన్ పై ప్రత్యేక పరిజ్ఞానం కలిగి ఉండాలి.

ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ : పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ,  గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి వుండాలి.

ల్యాబ్ అటెండెంట్: పదవ తరగతి ఉత్తీర్ణ సాధించి ల్యాబ్ అటెండెంట్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి.

🔥 గరిష్ఠ వయస్సు

42 సంవత్సరాలు లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 సంవత్సరాలు – దివ్యాంగులు వారికి 10 సంవత్సరాలు వయసడలింపు కలదు.

🔥 దరఖాస్తు విధానం:

అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అధికారిక వెబ్సైట్ నుండి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, ఫిల్ చేసి సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి మే 10 వ తారీఖు లోగా సూపరిండెంటెంట్ , మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి వద్ద సబ్మిట్ చేయాలి.

🔥 దరఖాస్తు తో పాటు అవసరమగు ధృవపత్రాలు : క్రింద పేర్కొన్న సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేసి, దరఖాస్తు తో పాటు జత చేయాలి.

పదవ తరగతి సర్టిఫికెట్

క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికెట్

క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కి హాజరు అయినట్లు ప్రూఫ్

అన్ని మార్క్స్ మెమోలు

ఏపీ పారా మెడికల్ బోర్డు / సంబంధిత హెల్త్ కేర్ సైన్సెస్/ ఇతర కౌన్సిల్ నందు  రిజిస్టర్ అయిన l సర్టిఫికెట్

నాల్గవ తరగతి నుండి 10 వ తరగతి వరకు గల స్టడీ సర్టిఫికెట్లు

ఇటీవల కుల ధ్రువీకరణ పత్రం

ఇటీవల EWS సర్టిఫికెట్ ( అవసరమగు వారికి)

సదరం సర్టిఫికెట్

సర్వీస్ సర్టిఫికెట్

సంబంధిత ఉద్యోగాలకు అవసరమయ్యే ఇతర సర్టిఫికెట్లు.

🔥 అప్లికేషన్ ఫీజు :

ఓసీ అభ్యర్థులు 300 రూపాయలు దరఖాస్తు ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ , SVMC, తిరుపతి పేరు మీదుగా చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ,దివ్యాంగులు వారికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

🔥 ఎంపిక విధానం: 

అభ్యర్థులకు ఎటువంటి వ్రాత పరిక్ష , ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

మొత్తం 100 మార్కులకు గాను ఎంపిక నిర్వహణ వుంటుంది.

అకడమిక్ విద్యార్హత లో మార్కులకు 75 శాతం వెయిట్ఏజ్, 15 శాతం గత అనుభవం (అవుట్సోర్సింగ్ / కాంట్రాక్టు / కోవిడ్ సర్వీస్) కి , 10 శాతం విద్య లో సీనియారిటీ కి కేటాయించారు.

🔥 జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా వారికి జీతం లభిస్తుంది.

ల్యాబ్ అటెండెంట్ & ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ గా ఎంపిన అయిన వారికి నెలకు 15,000/- రూపాయల జీతం లభిస్తుంది.

మార్చురీ మెకానిక్ గా ఎంపిన అయిన వారికి 18,000/- రూపాయల జీతం లభిస్తుంది.

డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ / మెకానిక్ గా ఎంపిక అయిన వారికి 18,500/- రూపాయల జీతం లభిస్తుంది.

అనస్తీషియా టెక్నీషియన్ గా ఎంపిక అయిన వారికి 32,670/- రూపాయల జీతం లభిస్తుంది.

🔥 ముఖ్యమైన తేదిలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ :01/05/2025

దరఖాస్తు స్వీకరణ కొరకు చివరి తేదీ : 10/05/2025

దరఖాస్తులు స్క్రూటినిటీ చేయి తేదీ : 20/05/2025

తాత్కాలిక మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 27/05/2025

పిర్యాదుల స్వీకరణ: 09/06/2025

ఫైనల్ మెరిట్ లిస్ట్ & సెలెక్షన్ లిస్ట్ విడుదల : 17/06/2025

అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం & సర్టిఫికెట్ వెరిఫికేషన్ : 23/06/2025

👉  Click here for notification

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!