TSCAB Staff Assistant Notification 2025 : తెలంగాణ రాష్ట్రంలో సహకార బ్యాంకుల్లో డిగ్రీ విద్యార్హతతో 225 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ ఆరు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఈ ఆరు నోటిఫికేషన్ల ద్వారా హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్ మరియు వరంగల్లో ఉన్న జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి మీరు తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు త్వరగా ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి..
Table of Contents :
నోటిఫికేషన్లు విడుదల చేసిన సంస్థ :
ఈ ఆరు నోటిఫికేషన్లు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్ మరియు వరంగల్లో ఉన్న జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల నుండి విడుదల చేయడం జరిగింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
సహకార బ్యాంకుల్లో ఉన్న స్టాఫ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్లు ద్వారా భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఆరు నోటిఫికేషన్ ద్వారా మొత్తం 225 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి.
పదో తరగతి వరకు తెలుగు భాష ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
ఇంగ్లీష్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయస్సు :
అ01-10-2025 తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 30 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
వయసులో సడలింపు వివరాలు :
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ , ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు వయసులో ఐదు సంవత్సరాలు సదలింపు ఇస్తారు.
PWD అభ్యర్థులకు వయసులో పదేళ్లు సడలింపు ఇస్తారు.
ఎంపిక విధానం వివరాలు :
అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్షలో మొత్తం 160 ప్రశ్నలు 160 మార్కులకు కేటాయిస్తారు.
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. సరైన సమాధానానికి ఒక మార్కు కలుపుతారు. తప్పు 0.25 మార్కు తగ్గిస్తారు.
గమనిక :
ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అనుకునేవారు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్లు డౌన్లోడ్ చేసుకొని చదివిన తర్వాత అప్లై చేయండి..
✅ Download All Notifications – Click here