తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ‘ కీ ‘ విడుదల | TG Nursing Officer Test Exam Key Released | TG Nursing Officer Response sheet

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

తెలంగాణలో రాష్ర్టంలో 2322 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా నవంబర్ 23న నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష ప్రాథమిక “కీ” ను మెడికల్ మరియు హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. 

అభ్యర్థులు తమ రెస్పాన్స్ సీట్ డౌన్లోడ్ చేసుకొని తమకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకునేందుకు అవకాశం ఉంది. “కీ” పైన అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్సైట్ లో నవంబర్ 28 సాయంత్రం ఐదు గంటల లోపు Key Objections పెట్టుకోవచ్చు. అభ్యంతరాలు పెట్టే ప్రతి ఒక్క అభ్యర్థి మాస్టర్ క్వశ్చన్ పేపర్ లో ఉన్న క్వశ్చన్ ఐడీల ఆధారంగా అబ్జెక్షన్ పెట్టాలి.

  • నవంబర్ 23వ తేదీన హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ మరియు నర్సంపేట లలో నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష రెండు సెషన్స్ లలో నిర్వహించడం జరిగింది. 
  • ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు రెండు సెషన్స్ లో కూడా ప్రశ్నాపత్రం కఠినంగా వచ్చిందని తెలిపారు. దీని కారణంగా కట్ ఆఫ్ మార్కులు భారీగా తగ్గే అవకాశం ఉంది. 
  • రెండు సెషన్స్ లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించడం కారణంగా బోర్డు ముందుగానే తెలియజేసిన విధంగా మార్కుల నార్మలైజేషన్ చేస్తారు. ఈ విధంగా నార్మలైజేషన్ చేయడం వలన అభ్యర్థులకు “కీ” చూసిన తర్వాత వచ్చిన మార్కులకు నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన మార్కులకు తేడా ఉంటుంది. అంటే నార్మలైజేషన్ చేయడం వలన సులభంగా వచ్చిన షిఫ్ట్ లో రాసిన అభ్యర్థులకు మార్కులు సంఖ్య నార్మలైజేషన్ చేసిన తర్వాత తగ్గుతుంది. కఠినంగా వచ్చిన షిఫ్ట్ లో పరీక్ష రాసిన అభ్యర్థులకు నార్మలైజేషన్ చేసిన తర్వాత మార్కుల సంఖ్య పెరుగుతుంది..
  • అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి రెస్పాన్స్ షీట్ మరియు మాస్టర్ క్వశ్చన్ పేపర్ ను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • “కీ” పైన అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్సైట్ లో నవంబర్ 28 సాయంత్రం ఐదు గంటల లోపు Key Objections పెట్టుకోవచ్చు. అభ్యర్థులు ఒక్కసారి మాత్రమే ఇలా అబ్జెక్షన్ పెట్టడానికి అవకాశం ఉంది. ఒకేసారి ఎన్ని ప్రశ్నలకైనా Key Objections పెట్టవచ్చు. ఈ విధంగా గ్రీవెన్స్ పెట్టడానికి అభ్యర్థులు తప్పనిసరిగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ PDF లేదా JPEG Format లో అప్లోడ్ చేయాలి.

నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు :: 👇 👇 👇 

ఈ సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన 2050 పోస్టులను భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత మరో 272 పోస్టులు కలిపి మొత్తం 2,322 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. అభ్యర్థుల నుండి అక్టోబర్ 19వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించింది.

🔥 ఎంపిక విధానము : ఈ ఉద్యోగాల ఎంపికలో మొత్తం 100 పాయింట్లకు ఎంపిక చేస్తారు.

  1. ఇందులో 80 పాయింట్లు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. 
  2. 20 పాయింట్లు గతంలో కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థలు, ప్రోగ్రాం లలో పనిచేసిన వారికి వెయిటిజి మార్కులు ఇస్తారు.

🔥 భర్తీ చేయబోయే మొత్తం ఖాళీల సంఖ్య : 2,322

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!