Telangana KGBV ANM & Accountant Notification 2025 | Latest jobs Notifications

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

తెలంగాణ రాష్ట్రంలో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో అకౌంటెంట్ మరియు ఏఎన్ఎం ఉద్యోగాల భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు అక్టోబర్ 24 వ తేదీ నుండి అక్టోబర్ 27వ తేదీలోపు అప్లై చేయాలి.. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న స్థానిక మహిళలు అర్హులు. ఒకటవ తరగతి నుండి 7వ తరగతి వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్ ఆధారంగా స్థానికత నిర్ధారిస్తారు.

నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి..

నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :

ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర శిక్ష జిల్లా విద్యాధికారి మరియు సంయుక్త ప్రాజెక్టు అధికారి వారి కార్యాలయం నుండి విడుదలైంది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా అకౌంటెంట్ మరియు ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు అకౌంటెంట్ పోస్ట్లు మరియు రెండు ఏఎన్ఎం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

విద్యార్హతలు వివరాలు :

  • అకౌంటెంట్ పోస్టులకు కామర్స్ లో డిగ్రీ అర్హతతో పాటు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. (లేదా)
  • బీ.కం (కంప్యూటర్స్) విద్యార్హత ఉన్నవారు అర్హులు.
  • ఎం.కమ్ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.
  • ఏఎన్ఎం ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హతతో పాటు గుర్తింపు పొందిన ప్రభుత్వ సంస్థ నుండి ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్ కలిగిన వారు అర్హులు.

అప్లికేషన్ తేదీలు :

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు అక్టోబర్ 24 వ తేదీ నుండి అక్టోబర్ 27వ తేదీలోపు అప్లై చేయాలి.

ఎంపిక విధానము :

అకౌంటెంట్ ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ లో వచ్చిన మార్కులకు 75% వెయిటేజీ ఇస్తారు. పీజీ లేదా M.Com లో వచ్చిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇస్తారు.

ఏఎన్ఎం ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్కులకు 45% వెయిటేజీ ఇస్తారు. ఏఎన్ఎం ట్రైనింగ్ లో వచ్చిన మార్కులకు 45 శాతం వెయిటేజీ ఇస్తారు. అంతేకాకుండా జిఎన్ఎమ్ విద్యార్హత కలిగి ఉంటే ఐదు మార్కులు, బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగి ఉంటే పది మార్కులు అదనంగా కలుపుతారు.

వయస్సు వివరాలు :

18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి..

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు జిల్లా విద్యాధికారి కార్యాలయం, S-34, జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం సముదాయము, రాజన్న సిరిసిల్ల జిల్లా నందు అప్లికేషన్ అందజేయాలి.

ముఖ్యమైన తేదీలు :

  • నోటిఫికేషన్ విడుదల తేదీ : 23-10-2025
  • అప్లికేషన్ ప్రారంభ తేదీ : 24-10-2025
  • అప్లికేషన్ చివరి తేదీ : 27-10-2025
  • తాత్కాలిక మెరిట్ లిస్టు విడుదల తేదీ : 30-10-2025
  • అభ్యంతరాల స్వీకరణ తేదీ : 31-10-2025
  • తుది మెరిట్ లిస్ట్ మరియు షార్ట్ లిస్ట్ ప్రదర్శన తేదీ : 03-11-2025
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ : 04-11-2025

Download Notification – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *