Telangana GPO Notification 2025 Released | TG GPO Recruitment 2025 | Telangana VRO / VRA Notification 2025

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన అధికారి ఉద్యోగాల భర్తీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీ ద్వారా 10,954 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాన్నీ పొందాలి అనుకుంటున్న వారికి ఇది ఒక మంచి అవకాశం.

తేది 29/03/2025 న పబ్లిక్ సర్వీసెస్ లో భాగం గా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో గ్రామ పాలనా అధికారి (Grama palana officiers) ఉద్యోగాల భర్తీ కి సంబంధించి G.O Rt.No 129 ను ప్రభుత్వం విడుదల చేసింది.

గ్రామ పాలనా అధికారి ఉద్యోగాలకు సంబంధించి సమగ్ర సమాచారం మొత్తాన్నీ కూడా ఈ G.O లో ప్రస్తావించారు.

నిరుద్యోగులు ఏదైనా డిగ్రీ సాధించి ఉంటే ఈ ఉద్యోగాలకు పొందవచ్చు.

నిరుద్యోగులతో పాటు గతంలో  VRO , VRA లుగా  వారిని  మళ్ళీ G.P.O( గ్రామ పాలనా అధికారి) లగా నియామకం చేసేందుకు గాను అవసరమగు అర్హతలను కూడా ఈ G.O లో ప్రస్తావించడం జరిగింది.

🏹 ఇలాంటి ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కి రావాలంటే క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel

29/03/2025 G.O.Ms NO:129 రెవిన్యూ శాఖను అనుసరించి భూ పరిపాలన ప్రధాన కమిషనర్, తెలంగాణ వారు మాజీ VRO,VRA ల నుండి ఆప్షన్లను తగు విధంగా తీసుకోవడం ద్వారా గ్రామ పాలనా అధికారులు నియామకం ప్రకటన జారీ చేసారు. ఫిల్ చేసిన దరఖాస్తులను స్వీకరణ కొరకు 16/04/2025 తేది లోగా దరఖాస్తు చేసుకోవాలి.

గ్రామ పాలన అధికారి ఉద్యోగానికి సంబంధించి అవసరమగు అర్హతలు, వయోపరిమితి,దరఖాస్తు విధానం జీతం & ఎంపిక విధానం వంటి అన్ని అంశాల వివరణ కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC ) ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

10,954 గ్రామ పాలనా అధికారి(GPO) ఉద్యోగాల నిమామకం జరగనుంది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

రెవెన్యూ డిపార్ట్మెంట్ లో గతంలో  విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO) గా పిలిచే వీటిని ప్రస్తుతం  గ్రామ పాలనా అధికారి (GPO) ఉద్యోగాలుగా భర్తీ చేస్తారు.

🔥 విద్యార్హత :

గ్రామ పాలనా అధికారిగా ఎంపిక కావడానికి అవసరమగు కనీస అర్హతలు ఈ విధంగా ఉన్నాయి.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.

                 (లేదా)

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి కనీసం 5 సంవత్సరాలు VRO గా పనిచేసి వుండాలి / జూనియర్ అసిస్టెంట్/ రికార్డ్ అసిస్టంట్  స్థాయి రెగ్యులర్ సర్విస్ VRA గా పని చేసి వుండాలి.

🔥  వయస్సు :

18 సంవత్సరాలు నిండి యుండి 46 సంవత్సరాల లోపు వయసు గల వారు అర్హులు.

ఎస్సీ , ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, Ex- సర్విస్ మాన్ వారికి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు  వయో సడలింపు కలదు.

🔥 ఉద్యోగ బాధ్యతలు : 

గ్రామ పాలనా అధికారులు గా నిర్వర్తించిన బాధ్యతలు & విధులు గురించి G.O లో తెలియచేశారు.

గ్రామ అకౌంట్లను మెయింటైన్ చేయాలి.

వివిధ ధ్రువపత్రాలు ను ఇచ్చేందుకు గాను ఎంక్వేరీ చేయాల్సి వుంటుంది.

ప్రభుత్వ భూములు, చెరువులు, నీటి కుంటలును సంరంక్షించుట, ఆక్రమణలు ను ఎంక్వైరీ చేయుట.

భూ తగాదాలను ఇన్వెస్టిగేషన్ చేయుట మరియు భూములను సర్వే చేయుటలో సర్వేయర్ లకు సహాయం చేయుట.

విపత్తు నిర్వహణ విధులు చేయుట & అత్యవసర సర్వీసులను అందించుట.

వివిధ సంక్షేమ పథకాల & అభివృద్ధి ప్రాజెక్టుల లబ్ధిదారులను గుర్తించుట.

ఎన్నికల కు సంబంధించిన విధులు నిర్వహణ & ప్రోటోకాల్ అధికారులకు సహకరించుట.

గ్రామ, క్లస్టర్, మండల స్థాయిలలో వివిధ ఇతర డిపార్ట్మెంట్ అధికారులకు సహకరించుట.

ప్రభుత్వం, చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా కలెక్టర్,రెవెన్యూ డివిజనల్ అధికారి వారు లేదా తహసిల్దార్ లు ఇచ్చే ఇతర విధులును కూడా నిర్వర్తించాలి.

🔥దరఖాస్తు విధానం :

నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత TGPSC వెబ్సైట్ లో ఆన్లైన్ విధానం దరఖాస్తు చేసుకోవాలి.

🔥 జీతం :

అన్ని అలవెన్స్ లు కలిపి నెలకు 45,000 /- రూపాయల వరకు జీతం లభిస్తుంది.

🔥 ఎంపిక చేయు విధానం :

అభ్యర్థులను ఎంపిక చేసేందుకు గాను వ్రాత పరీక్ష నిర్వహించి ,పరీక్ష లో వచ్చిన మార్కుల ఆధారంగా ,మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేపడతారు.

🔥 మాజీ VRO/ VRA వారికి గ్రామపాలనా అధికారుల నియామకం కొరకు ముఖ్యమైన సమాచారం :

వీరు 16/04/2025 తేదీలోగా గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అలానే స్వయంగా సంతకం చేసిన దరఖాస్తు కాపీ ను జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం కు అందజేయాలి.

 👉 Click here to apply via Google form

👉 Click here to Download official G.O

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *