Telangana Endowment Department Jobs Notification 2025 : తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ శాఖలో లీగల్ ఆఫీసర్ , అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ కోసం దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.. అర్హత ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. అన్ని వివరాలు తెలుసుకొని అర్హత ఉన్నవారు డిసెంబర్ 15వ తేదీలోపు అప్లై చేయండి.
▶️ విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
Table of Contents :
నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
తాజాగా విడుదల చేయబడ్డ ఈ నోటిఫికేషన్ ద్వారా లీగల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు..
అర్హతలు :
- లీగల్ ఆఫీసర్ ఉద్యోగాలకు LLB / LLM విద్యార్హత కలిగి ఉండి హైకోర్టు లేదా జిల్లా కోర్టులో 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉండాలి.
- అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ ఉద్యోగాలకు LLB / LLM విద్యార్హత కలిగి హైకోర్టు లేదా జిల్లా కోర్టులో ఐదు సంవత్సరాలు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లేదా గవర్నమెంట్ బాడీ నందు ఐదు సంవత్సరాల్లో లీగల్ ఆఫీసర్ గా పని చేసి ఉండాలి.
జీతము వివరాలు :
లీగల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు లక్ష రూపాయలు జీతం ఇస్తారు.
అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఎంపికైన వారికి నెలకు 44,000/- జీతం ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానము :
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
కమిషనర్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్, బొగ్గులకుంట, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్, 500001
✅ Download Notification – Click here
✅ Download Application – Click here
