Telangana EMRS Outsourcing Jobs Recruitment 2025 : తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లేదా కళాశాలల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ లోపు అప్లై చేయాలి.
ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి.
Table of Contents
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయం నుండి ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నడపబడుతున్న తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు కళాశాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ కోసం విడుదల చేయడం జరిగింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో టీజీటీ, లైబ్రేరియన్, సెక్యూరిటీ గార్డ్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, వంట మనిషి (కుక్), స్వీపర్ లేదా మెస్ హెల్పర్ మరియు గార్డినర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :
పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, ల్యాబ్ టెక్నీషియన్ డిప్లమో లేదా సర్టిఫికెట్ కోర్సులు, బిఈడి, MLSC మరియు ఇతర విద్యార్హతలు ఉన్నవారు అర్హులు.
భర్తీ చేస్తున్న మొత్తం ఖాళీల సంఖ్య :
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అప్లికేషన్ తేదీలు :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీలోపు అప్లై చేయాలి.
ఎంపిక విధానము :
టీచింగ్ ఉద్యోగాలకు విద్యార్హతలు వచ్చిన మెరిట్ మరియు డెమో ఆధారంగా ఎంపిక చేస్తారు. నాన్ టీచింగ్ ఉద్యోగాలకు గిరిజన అభ్యర్థుల విద్యార్హతలు వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా EMRS లో ఉచితంగా దరఖాస్తులు పొందవచ్చు.
గమనిక :
బోధ నేతల సిబ్బంది ఉద్యోగాలకు గిరిజన అభ్యర్థుల నుండి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
✅ Download Notification – Click here
