తెలంగాణ రాష్ట్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హతలు ఉండేవారు తమ దరఖాస్తులను డిసెంబర్ 5వ తేదీ లోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. పూర్తి వివరాలు తెలుసుకొని ఆసక్తి మరియు అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి.
నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో ఉన్న మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ANM, సూపర్ఇంటెండెంట్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, పారామెడికల్ స్టాఫ్, స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, జెండర్ స్పెషలిస్ట్, కేస్ వర్కర్, హోం కోఆర్డినేటర్, డాక్టర్, సోషల్ వర్కర్, నర్స్, అకౌంటెంట్ కంక్లర్కు మరియు యోగా తెరపిస్ట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :
పోస్టులను అనుసరించి 12th, డిగ్రీ, ANM GNM, Bsc Nursing, మరియు ఇతర అర్హతలు ఉన్న వారు అర్హులు
అప్లికేషన్ తేదీలు :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను డిసెంబర్ 5వ తేదీలోపు అప్లై చేయాలి.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
- రూమ్ నెంబర్ – 114, జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, పెద్దపల్లి జిల్లా
✅ Download Notification – Click here
✅ Download Application – Click here
