RRB NTPC Undergraduate Notification 2025 Details : భారతీయ రైల్వేలో 12వ తరగతి విద్యార్హతతో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3058 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 28వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకొని అర్హత ఉన్న వారు తప్పనిసరిగా అప్లై చేయండి..
Table of Contents :
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్ బోర్డుల నుండి విడుదల కావడం జరిగింది.
భర్తీ చేస్తున్న మొత్తం పోస్టుల సంఖ్య :
3058 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా 2424 కమర్షియల్ కం టికెట్ క్లర్క్, 394 అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్, 163 జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్ మరియు 77 ట్రైన్స్ క్లర్కు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఉండవలసిన విద్యార్హతలు :
కనీసం 50% మార్కులతో 12వ తరగతి పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు వివరాలు :
01-01-2026 తేదీ నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకి అప్లై చేయుటకు అర్హులు.
వయసులో సడలింపు వివరాలు :
ఎస్సీ మరియు ఎస్సీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానము :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో భాగంగా CBT-1, CBT -2 , కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 28-10-2025
అప్లికేషన్ చివరి తేదీ : 27-11-2025
అప్లికేషన్ ఫీజు చెల్లించుటకు చివరి తేదీ : 29-11-2025
✅ Download Notification – Click here
