రైల్వేలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (అండర్ గ్రాడ్యుయేట్) (RRB NTPC Undergraduate Exam Dates 2025) ఉద్యోగాలకు అప్లై చేసుకుని పరీక్షా తేదీల కోసం ఎదురుచూస్తున్న వారికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష తేదీలను తెలియజేస్తూ నోటీస్ విడుదల చేసింది. ఈ నోటీస్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2024లో విడుదల చేసిన 06/2024 నోటిఫికేషన్ యొక్క పరీక్ష తేదీలను ప్రకటించింది . ఈ పరీక్షలను ఆగస్టు 7వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపింది.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (అండర్ గ్రాడ్యుయేట్) లో మొత్తం 3445 ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.

✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 అభ్యర్థులకు రిక్రూట్మెంట్ బోర్డ్ సూచనలు :
అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ పరీక్ష తేదీ మరియు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రం పట్టణం వివరాలను పరీక్ష తేదీకి పది రోజులు ముందు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు ట్రావెల్ అధారిటీని పరీక్షకు పది రోజులు ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఈ కాల్ లెటర్ లను అభ్యర్థులు పరీక్ష తేదీకి నాలుగు రోజులు ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- అభ్యర్థి పరీక్షా కేంద్రంలోని హాల్ లోపలికి ప్రవేశించే ముందు ఆధార్ బయోమెట్రిక్ ప్రమాణీకరణ నిర్వహిస్తారు.
- కాబట్టి అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ కార్డు పట్టుకొని వెళ్లాలి. ఆధార్ అథెంటిఫికేషన్ చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు RRB అధికారిక వెబ్సైట్లో ముందుగా ఆధార్ వెరిఫికేషన్ చేసుకొని ధ్రువీకరించుకోవాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే సమయంలో ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వారు UIDAI సిస్టంలో తమ ఆధార్ అన్లాక్ లో ఉందో లేదో ముందుగానే చెక్ చేసుకోవాలి.
- రిక్రూట్మెంట్ ప్రాసెస్ కి సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్స్ లో చూడాలని తాజాగా విడుదల చేసిన నోటీసులో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సూచన చేసింది.
- ఉద్యోగాలు ఇస్తామని చెప్పేవారి మాటలను నమ్మవద్దని, రిక్రూట్మెంట్ ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుందని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది.