రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (NTPC) ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అప్డేట్ ఇవ్వడం జరిగింది.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సంస్థ ఇప్పటికే NTPC పరీక్షా తేదీలను విడుదల చేయడం జరిగింది.
జూన్ 5వ తేదీ నుండి జూన్ 24వ తేదీ వరకు 16 రోజులు లో మొత్తం పరీక్షలు నిర్వహిస్తారు.
- ఇందులో భాగంగా ఇప్పుడు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
- ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ? ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకుని ఎందుకు గాని అవసరమగు వివరాలు ఏంటి ? వంటి వివరాలు తెలుసుకునేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🔥 జూన్ 05 నుండి NTPC పరీక్షలు :
- రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సంస్థ జూన్ 5వ తేదీ నుండి నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీ (గ్రాడ్యుయేట్) ఉద్యోగాలకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ – 1 ను జూన్ 5వ తేదీ నుండి జూన్ 25వ తేదీ వరకు నిర్వహించనుంది.
- RRB సంస్థ ఇప్పటికే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో , వారిలో దరఖాస్తు ఆమోదించబడిన వారికి provisionally accepted మెసేజ్ ను ఈమెయిల్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా పంపించడం జరిగింది.
🔥 సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి (RRB NTPC (Graduate) City Intimation Slip & Mock Test Link)
- ఎవరివైతే దరఖాస్తులు అంగీకరించబడ్డాయో వారందరూ కూడా సిటీ ఇంటివేషన్స్ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఇందుకు గాను అధికారిక వెబ్సైట్లో ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది.
- ముందుగా అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు మరియు పాస్వర్డ్ అనగా డేట్ అఫ్ బర్త్ నో ఎంటర్ చేసి క్యాప్షన్ కూడా టైప్ చేయాలి.
- లాగిన్ పై క్లిక్ చేశాక మీరు ఏ తేదీన పరీక్ష రాయాలి మరియు ఏ సిటీలో పరీక్ష రాయాల్సి ఉంటుంది వివరాలను ఇవ్వడం జరుగుతుంది.
- సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది కేవలం మీ సమాచార నిమిత్తం మాత్రమే. ఇది హాల్ టికెట్ గాను అడ్మిట్ కార్డ్ గాను పనికిరాదు.
- అడ్మిట్ కార్డ్ / హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకుగాను మరికొద్ది రోజుల్లో అవకాశం కల్పిస్తారు.
🔥 రిజిస్ట్రేషన్ నెంబరు మర్చిపోతే ఎలా? :
- అభ్యర్థులు సిటీ ఇంటిమేషన్ లిఫ్ట్ డౌన్లోడ్ చేసుకునేందుకు గాను రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు.
- గతంలో మీరు ఆన్లైన్ విధానం ద్వారా NTPC ఉద్యోగాలకు లేదా ఇతర RRB ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వెబ్సైట్ నందు మొబైల్ నెంబర్ మరియు ఆధార్ లింక్ ఓటిపి తో లాగిన్ అయ్యాక, అప్లికేషన్ హిస్టరీ (application history) అనే మెనూ పై క్లిక్ చేస్తే మీరు ఆర్ఆర్బి సంబంధించి ఏ ఏ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్లు అన్నీ చూపిస్తాయి.
- అందులో NTPC గ్రాడ్యుయేట్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ను నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకునేందుకు గాను ఇచ్చిన వెబ్సైట్ లింక్ నందు మీరు చాలా సులభతరంగా లాగిన్ కావచ్చు.
👉 Click here for RRB NTPC (Graduate) exam City intimation Slip
👉 Click here to Know your Registration number