సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) , రాయ్ పూర్ డివిజన్ వేగన్ రిపేర్ షాప్ నుండి 1003 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అప్రెంటిస్ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న వారు అప్లై చేయండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) , రాయ్ పూర్ డివిజన్ వాగన్ రిపేర్ షాప్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
1003 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు వివిధ ట్రేడ్స్ లో భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
వివిధ ట్రేడ్స్ లో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి.
పోస్టులను అనుసరించి సంబంధిత ట్రేడ్స్ లో ITI పూర్తి చేసి ఉండాలి.
🔥 అప్రెంటిస్ శిక్షణ కాలం :
ఎంపికైన వారికి ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
ఎస్సీ, ఎస్టీ, PwBD మరియు మహిళలకు ఫీజు లేదు.
మిగతా వారికి అప్లికేషన్ ఫీజు 100/-
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
ఈ అప్రెంటిస్ పోస్టులకు 03-03-2025 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
02-04-2025 తేది లోపు అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ విధానం :
అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.
🔥 వయస్సు :
01-03-2025 తేది నాటికి 15 సంవత్సరాలు నుండి 24 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలి.
🔥 వయస్సు సడలింపు :
SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సు ఉంటుంది.
🔥 స్టైఫండ్ :
ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇస్తారు.
🔥 ఎంపిక విధానం :
అర్హత ఉన్న వారిని షార్ట్ లిస్ట్ చేసి , డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే వారు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here
🏹 Official Website – Click here