రైల్వేలో 9,970 ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల | Railway Jobs Notification 2024 | RRB ALP Notification 2025

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

రైల్వే ఉద్యోగాల కొరకు వేచి చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త ! రైల్వే డిపార్ట్మెంట్ లో ఖాళీగా వున్న ఉద్యోగాలకు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  అసిస్టెంట్ లోకో పైలట్ – 2024 రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉండగా , అసిస్టెంట్ లోకో పైలట్ – 2025 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు గాను రంగం సిద్ధం అయ్యింది.

రైల్వే బోర్డుకి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు నుంచి అన్ని జోన్స్ యొక్క జనరల్ మేనేజర్లకు అసిస్టంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్ కి సంబంధించి వేకెన్సీల నిమిత్తం  ఇండెంట్ జారీ చేశారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • భారతదేశం లోని అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల్లో ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య

  • మొత్తం 9,970 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • అసిస్టంట్ లోకో పైలట్ (RRB ALP) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత :

  • 10 వ తరగతి ఉత్తీర్ణత తో పాటు సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటిఐ పూర్తి చేయాలి.
  • మెకానికల్ / ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటో మొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.

🔥 జోన్ల వారీగా ఖాళీల వివరాలు: 

క్రమ సంఖ్య రైల్వే జోన్ఖాళీల వివరాలు
1సెంట్రల్ రైల్వే376
2ఈస్ట్ సెంట్రల్ రైల్వే700
3ఈస్ట్ కోస్ట్ రైల్వే1461
4ఈస్టర్న్ రైల్వే768
5నార్త్ సెంట్రల్ రైల్వే508
6నార్త్ ఈస్టర్న్ రైల్వే100
7నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే125
8నార్తర్న్ రైల్వే521
9నార్త్ వెస్ట్రన్ రైల్వే679
10సౌత్ సెంట్రల్ రైల్వే989
11సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే568
12సౌత్ ఈస్టర్న్ రైల్వే796
13సదరన్ రైల్వే510
14వెస్ట్ సెంట్రల్ రైల్వే759
15వెస్టర్న్ రైల్వే885
16మెట్రో రైల్వే కలకత్తా 225
మొత్తం 9970

🔥  వయస్సు :

  • అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు నిండి యుండి 33 సంవత్సరాలలోపు వుండాలి.
  • గరిష్ట వయస్సు నిర్ధారణ లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , ఒబిసి వారికి 3 సంవత్సరాలు , దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో  దరఖాస్తు చేసుకోవాలి.

🔥 ఎంపిక విధానం :

  • కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష (CBT – 1 & CBT – 2) , కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ , పాటు  డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

 🔥 నోట్

  • RRB ALP ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. మరికొద్ది. రోజులలో నోటిఫికేషన్ విడుదల అవుతుంది.అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యాక , పూర్తి సమాచారాన్ని తెలుసుకొని దరఖాస్తు చేసుకోవలెను.
  • అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యాక మరొక ఆర్టికల్ లో ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం తెలియచేయడం జరుగును.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!