PM YASASVI YOJANA ప్రధానమంత్రి యశస్వి యోజన ద్వారా విద్యార్థులకు 1.25 లక్షల స్కాలర్షిప్

PM Yasasvi Yojana Scholarship Apply Link
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

PM YASASVI YOJANA Scholarship Apply : విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది. 2020 – 21 విద్యా సంవత్సరం నుండి ప్రారంభించిన ప్రధాన మంత్రి యశస్వి యోజన పథకం ద్వారా అందించే స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకొనేందుకు 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను అవకాశం కల్పించింది.

ఆగస్టు 31వ తేదీలోగా ఈ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలలో 9వ తరగతి నుండి 11 తరగతి లోపు విద్యార్థులు అందరూ కూడా ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం , సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేయబడుతున్న పీఎం యశస్వి యోజన పథకం (PM YASASVI YOJANA – Prime minister young achievers scholarship award scheme for vibrant India) ద్వారా ఏ విధముగా స్కాలర్ షిప్ పొందాలి ? దరఖాస్తు చేయు విధానం ఏమిటి ? స్కాలర్ షిప్ కొరకు విద్యార్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారు ? వంటి వివిధ అంశాలను ఈ ఆర్టికల్ లో తెలియజేయడం జరిగింది.

🔥 ప్రధాన మంత్రి యశస్వి యోజన (PM YASASVI YOJANA) స్కాలర్షిప్ కు ఎవరు అర్హులు ? :

  • భారతదేశంలో సామాజికంగా వెనుకబడిన OBC , EWS మరియు DNT విద్యార్థుల కొరకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
  • ఇది ఒక స్కాలర్షిప్ పథకం. ఈ పథకం ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం.
  • 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగి ఉంటారు.

🔥 PM YASASVI YOJANA – ఆర్థిక ప్రయోజనాలు :

  • ఈ పథకం ద్వారా తొమ్మిదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ లను అందజేస్తున్నారు.
  • తొమ్మిదవ తరగతి మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి 75 వేల రూపాయలు & ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం మరియు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి 1,25,000 స్కాలర్షిప్ రూపేణా అందిస్తున్నారు.

🔥 కుటుంబ వార్షిక ఆదాయం :

  • ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల యొక్క వార్షిక కుటుంబ ఆదాయం 2,50,000/- కంటే తక్కువగా ఉండాలి.

డిగ్రీ అర్హతతో 750 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here

🔥 PM YASASVI YOJANA స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేయు విధానం :

  • పి ఎం యశస్వి స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఈ విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకొనేందుకు గాను ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించారు.

🔥 PM YASASVI YOJANA దరఖాస్తు కొరకు అవసరమగు ధ్రువపత్రాలు :

దరఖాస్తు చేసుకోవాలి అనుకునే విద్యార్థులు ఈ కింది ధ్రువపత్రాలు కలిగి వుండాలి. అవి :

  • 1. విద్యార్హత పాస్ సర్టిఫికెట్
  • 2. విద్యార్థి ఆధార్
  • 3. ఆదాయ దృవపత్రం
  • 4. కుల ధ్రువీకరణ పత్రం
  • 5. బ్యాంకు అకౌంట్ ( ఆధార్ కి లింక్ చేయబడి వుండాలి )
  • 6. పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
  • 7. విద్యార్థి సంతకం
  • 8.ఫోన్ నెంబర్

🔥 స్కాలర్ షిప్ పొందే విద్యార్థుల సంఖ్య :

  • పీఎం యశస్వి స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకున్న అందరూ అభ్యర్థులకు ఈ స్కాలర్షిప్ లభించదు.
  • కేంద్ర ప్రభుత్వం పీఎం యశస్వి పథకం లబ్ధిదారులను రాష్ట్రాల ఆధారంగా ఎంపిక చేస్తుంది.
  • ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1401 మంది విద్యార్థులను మరియు తెలంగాణ రాష్ట్రంలో 1001 విద్యార్థులను స్కాలర్షిప్ కొరకు ఎంపిక చేస్తారు.

ఇక ఉచిత బస్సు ప్రయాణం కోసం గుర్తింపు కార్డు అవసరం లేదు – Click here

🔥 పీఎం యశస్వి స్కాలర్షిప్ ఎంపిక విధానం :

  • ఈ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి , పరీక్ష లో మెరిట్ వచ్చిన విద్యార్థులను ఎంపిక చేస్తారు.
  • నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA ) వారు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
  • ఇది OMR ఆధారిత ఆబ్జెక్టివ్ వ్రాత పరీక్ష . ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ఈ పరీక్ష వుంటుంది.

🔥 పరీక్ష విధానం :

  • ఈ పరీక్షలో 100 ప్రశ్నలు వుంటాయి. మొత్తం 400 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 3 గంటల సమయం కేటాయిస్తారు.
  • ఇది ఓఎంఆర్ ఆధారిత బహుళైచ్చిక ప్రశ్నలను కలిగి ఉంటుంది.
  • పరీక్షలో మ్యాథమెటిక్స్ , సైన్స్ , సోషల్ స్టడీస్ , జనరల్ నాలెడ్జ్ నుండి ప్రశ్నలు వస్తాయి.
క్రమ సంఖ్య సబ్జెక్ట్ ప్రశ్నలుమార్కులు
01మాథెమాటిక్స్ 30120
02జనరల్ సైన్స్2080
03సోషల్ స్టడీస్25100
04జనరల్ నాలెడ్జ్25100
  • సెప్టెంబర్ 29 న తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 31/08/2025.
  • స్కాలర్ షిప్ ఎంపిక కొరకు విద్యార్థుల కి వ్రాత పరీక్ష నిర్వహణ : 29/09/2025

👉 Click here to Apply

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!