ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ జనరల్ మేనేజర్ – ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ అనే పోస్ట్ భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు తమ CV ను నవంబర్ 17వ తేదీలోపు మెయిల్ చేయాలి.
తాజాగా విడుదల చేయబడ్డ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ చానల్స్ లో వెంటనే జాయిన్ అవ్వండి.
Table of Contents :
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న పోస్టులు :
డిప్యూటీ జనరల్ మేనేజర్ – ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ అనే ఒక పోస్ట్ భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
విద్యార్హత వివరాలు :
బిఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ విద్యార్హత ఉన్నవారు అర్హులు.
అనుభవం వివరాలు :
ప్రభుత్వ సంస్థలలో ఐటీ ప్రాజెక్టు మేనేజ్మెంట్ , సిస్టం ఆర్కిటెక్చర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు ఆపరేషన్స్ నందు కనీసం ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతము వివరాలు :
ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 69,950/- జీతము ఇస్తారు.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్థులను అర్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్టు చేసిన తరువాత ఎక్స్పర్ట్స్ కమిటీ వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ చివరి తేదీ :
అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 17వ తేదీ లోపు తమ CV ను eoadmin@ntrvs.ap.gov.in అనే మెయిల్ కు పంపించాలి.
ఇంటర్వ్యూ తేది :
షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు నవంబర్ 19వ తేదిన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
✅ Download Notification – Click here
✅ Official Website – Click here
