NTPC లిమిటెడ్ మరియు SAIL సంస్థల జాయింట్ వెంచర్ కంపెనీ అయిన NTPC SAIL పవర్ కంపెనీ లిమిటెడ్ (NSPCL) సంస్థ నుండి అసిస్టెంట్ ఆఫీసర్ (ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్) ,అసిస్టెంట్ ఆఫీసర్ (సేఫ్టీ) ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం ,ఎంపిక విధానం, జీతం వంటి అన్ని అంశాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
NTPC SAIL పవర్ కంపెనీ లిమిటెడ్ (NSPCL) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 05 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
అసిస్టెంట్ ఆఫీసర్ (ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్) – 03
అసిస్టెంట్ ఆఫీసర్ (సేఫ్టీ) – 02
🔥 విద్యార్హత :
అసిస్టెంట్ ఆఫీసర్ (ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్):
60 శాతం మార్కులతో ఎన్విరాన్మెంట్ విభాగంలో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
(లేదా)
60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ / ఎన్విరాన్మెంట్ సైన్స్ / ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా / ఎం.ఎస్సీ / ఎం.టెక్ ఉత్తీర్ణత సాధించాలి.
అసిస్టెంట్ ఆఫీసర్ (సేఫ్టీ) :
మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / సివిల్ / ప్రొడక్షన్ / కెమికల్ / కన్స్ట్రక్షన్ / ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ ఉత్తీర్ణత సాధించాలి.
🔥 వయస్సు :
అసిస్టెంట్ ఆఫీసర్ (ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్) ఉద్యోగాలకు 30 సంవత్సరాల లోపు వారు & అసిస్టెంట్ ఆఫీసర్ (సేఫ్టీ) ఉద్యోగాలకు 45 సంవత్సరాల లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులను ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
అభ్యర్థులను ఆన్లైన్ వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
సబ్జెక్టివ్ నాలెడ్జ్ టెస్ట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లు నిర్వహిస్తారు.
🔥 జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 30,000/- రూపాయల బేసిక్ పే తో పాటు అన్ని అలవెన్సులు లభిస్తాయి.
🔥 ముఖ్యమైన తేదిలు :
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 21/04/2025 (10:00 గంటల నుండి)
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 05/05/2025
అభ్యర్థులు పూర్తి సమాచారం కొరకు క్రింద లింక్ లో ఇవ్వబడిన అధికారిక నోటిఫికేషన్ ను & అధికారిక వెబ్సైట్ ను సందర్శించగలరు.