NMMS Scholarship Apply Online 2025 | NMMS Scholarship Eligibility

NMMS Scholarship Amount
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

NMMS Scholarship 2025-26 : ప్రభుత్వ పాఠశాలలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS) కొరకు 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

కేంద్ర ప్రభుత్వం విద్యా శాఖ ఆధ్వర్యం లో 2008 విద్యా సంవత్సరం నుండి ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ను ప్రారంభించింది. ఈ స్కాలర్షిప్ నకు ఎంపిక అయిన వారికి 9 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ పూర్తి అయ్యేంత వరకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు అందచేస్తారు.

NMMS స్కాలర్షిప్ కొరకు ఎటువంటి విద్యార్హతలు కలిగి వుండాలి. ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక కొరకు నిర్వహించే పరీక్ష ఏ విధంగా నిర్వహిస్తారు. ఇతర అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

పదో నుండి డిగ్రీ చదివే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్న ఎల్ఐసి – Click here

🔥 NMM Scholarship Full Form :

  • నేషనల్ మెరిట్ కం మీన్స్ స్కాలర్షిప్ స్కీమ్ 2025 – 26.

🔥 Who provides NMMS scholarship? :

  • భారత ప్రభుత్వం , విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గల డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ నుండి ఈ స్కాలర్షిప్ అందచేస్తారు.

🔥 NMMSS main objective :

  • ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ప్రదానం చేయడం, 8వ తరగతిలో వారి డ్రాపౌట్‌ను అరికట్టడం మరియు సెకండరీ దశలో చదువును కొనసాగించేలా వారిని ప్రోత్సహించడం ఈ స్కాలర్ షిప్ యొక్క ప్రధాన లక్ష్యం.

🔥 లభించే స్కాలర్ షిప్ :

  • ఈ స్కాలర్షిప్ పథకం ద్వారా ఎంపిక కాబడిన విద్యార్థులకు 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ పూర్తి అయ్యేంత వరకు ప్రతి సంవత్సరం నెలకు వెయ్యి రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 స్కాలర్షిప్ మొత్తంగా లభిస్తుంది.

ఏపీ వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలకు మీ మొబైల్ లో అప్లై చేయండి – Click here

🔥 Requirements for NMMS scholarship :

  • ఈ స్కాలర్షిప్ పొందేందుకు గాను ఈ క్రింది అర్హతలు అవసరం అవుతాయి.
  • విద్యార్థులు ప్రభుత్వ / ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో 8 వ తరగతి చదువుతూ వుండాలి.
  • కుటుంబ వార్షిక ఆదాయం 3.50 లక్షల లోపు ఉండాలి.
  • విద్యార్థులు 7 వ తరగతి లో కనీసం 55 శాతం మార్కులు పొంది వుండాలి. ( ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించినా దరఖాస్తు చేసుకోవచ్చు )

🔥 వయస్సు :

  • 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులు , 13 నుండి 15 సంవత్సరాలు లోపు వయస్సు కలిగి వున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

🔥 దరఖాస్తు విధానం :

  • ఈ స్కాలర్షిప్ కొరకు అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు చేసేటప్పుడు విద్యార్థుల వివరాలు ఆధార్ కార్డు లో ఉన్న విధంగా నమోదు చేసుకోవాలి. విద్యార్థి పేరు , పుట్టిన తేదీ , తండ్రి పేరు తప్పులు లేకుండా నమోదు చేయాలి.
  • దరఖాస్తు చేయు సమయంలో ఎటువంటి ధ్రువపత్రాలు అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. అయితే పరీక్ష రాసే సమయానికి మాత్రం అన్ని ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవాలి.

🔥 దరఖాస్తు ఫీజు :

  • ఈ స్కాలర్ షిప్ కొరకు దరఖాస్తు చేసుకొనేందుకు గాను ఆన్లైన్ విధానం లో దరఖాస్తు ఫీజును చెల్లించవలసి ఉంటుంది.
  • ఓసీ , బీసీ అభ్యర్థులు 100 రూపాయలు & ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SBI కలెక్ట్ లింక్ ద్వారా మాత్రమే పరీక్షా ఫీజు చెల్లించవలసి ఉంది.

🔥 స్కాలర్షిప్ కొరకు ఎంపిక విధానం :

  • ఈ స్కాలర్షిప్ కొరకు ఎంపిక చేసేందుకు గాను రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా
  • 1. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT ) : 90 మార్కులకు గాను 90 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు కేటాయించారు. ఎటువంటి నెగటివ్ మార్కింగ్ విధానం ఉండదు.
  • 2. స్కాలిస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ( SAT ) : ఇందులో కూడా 90 ప్రశ్నలు ఉంటాయి.90 మార్కులు కేటాయించారు. సైన్స్ , సోషల్ , మ్యాథ్స్ ప్రశ్నలు వుంటాయి. ఇందులో కూడా ఎటువంటి నెగటివ్ మార్కింగ్ విధానం లేదు.
  • ఈ పరీక్ష లో విద్యార్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి . ఎస్సీ , ఎస్టీ విద్యార్థులు కనీసం 32 శాతం మార్కులు సాధించాలి.
  • వ్రాత పరీక్ష ను 07/12/2025 నాడు నిర్వహిస్తారు. సొంత జిల్లాలోనే పరీక్ష రాసే అవకాశం ఉంటుంది.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 04/09/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 30/09/2025

👉 Click here to apply NMMSS

👉 Click here for paper statement

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *