రాజేంద్రనగర్ లో గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NIRDPR) సంస్థ నుండి డేటా ఏన్యుమరేటర్స్ (Data Enumerators ) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయింది.
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారు రాజస్థాన్ రాష్ట్రంలోని 38 జిల్లాల్లో విస్తరించి ఉన్న 149 WDC-PMKSY-2.0 వాటర్‌షెడ్ ప్రాజెక్టుల మధ్యంతర మూల్యాంకనం కొరకు పనిచేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ నుండి విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు. కాబట్టి ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీ లోపు అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు..
ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు ఏమిటి ? మొత్తం ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ? ఈ ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? రెమ్యూనరేషన్ ఎంత లభిస్తుంది ? అనే వివరాలు అన్ని మీరు పూర్తిగా తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయండి. ఈ ఆర్టికల్ చివరిలో మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు లింకు ఇవ్వడం జరిగినది దానిపైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.. All the best 👍
🏹 Join Our What’sApp Group – Click here
🔥 Table of Contents :
🔥NIRDPR has released a notification for which jobs?
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతి రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ నుండి డేటా ఏన్యుమరేటర్స్ అనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయింది.
🔥 Number of jobs to be created by NIRDPR :
- ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా కనీసం 150 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 NIRDPR Data Enumerators Qualification :
- ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
🔥 NIRDPR Data Enumerators Age Details :
- 45 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 దరఖాస్తు చేయు విధానము :
- ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న అభ్యర్థులు అధికారిక మెయిల్ ఐడి : cgard@nirdpr.org.in కి తమ యొక్క బయోడేటా ను & సంబంధిత ధ్రువపత్రాలను పంపించాలి.
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 30/09/2025
- అభ్యర్థులు పేరు , తండ్రి పేరు , చిరునామా , ఫోన్ నెంబర్, నివాస స్థలం వివరాలు మరియు విద్యార్హత తో CV మరియు ఉన్నత విద్యార్హత యొక్క మార్క్స్ షీట్ , 10 వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ మరియు ఆధార్ కార్డు & బ్యాంకు అకౌంట్ కూడా జత చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హత కలిగిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ వుంటుంది.
- ఎంపిక కాబడిన అభ్యర్థులను మెయిల్ ఐడి / మొబైల్ నెంబర్ ద్వారా సమాచారం అందిస్తారు.
🔥 రెమ్యునరేషన్ :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు రోజుకు 800/- రూపాయలు & పోస్ట్ గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు రోజుకు 1000 రూపాయలు రెమ్యునరేషన్ రూపంలో లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీ :
- మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 30/09/2025
