NIA ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వివిధ ఎయిర్ పోర్ట్ లలో పనిచేసేందుకు గాను కస్టమర్ సర్వీసెస్ అసోసియేట్ (CSA) ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.
దేశవ్యాప్తంగా మొత్తం 4,787 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను అడ్వర్టైజ్మెంట్ విడుదల అయ్యింది.
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం , పరీక్షా విధానం , పరీక్షా కేంద్రాలు మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ఉద్యోగాలు – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- NIA ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- కస్టమర్ సర్వీసెస్ అసోసియేట్ (CSA) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- 4,787 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్మీడియట్ (10+2) విద్యార్హత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 గరిష్ట వయస్సు :
- 18 సంవత్సరాలు నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01 జూలై 2025 ను కట్ ఆఫ్ తేదీ గా నిర్ణయించారు.
- అభ్యర్థులు శారీరకంగా & మానసికంగా ఆరోగ్యవంతులు అయి వుండాలి.
🔥దరఖాస్తు విధానం :
- ఈ ఉద్యోగాలు కొరకు అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- అభ్యర్థులు 400/- + GST రూపాయల దరఖాస్తు ఫీజును ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను ఆన్లైన్ / ఆఫ్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ఆన్లైన్ పరీక్షా విధానం :
- మొత్తం 100 మార్కులకు గాను ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరిక్ష నిర్వహిస్తారు.
- 100 ప్రశ్నలు వుంటాయి, ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు కేటాయించారు.
- ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ , న్యూమరిక్ ఆప్టిట్యూడ్ , జనరల్ ఇంగ్లీష్ , జనరల్ అవేర్నెస్ నుండి ఒక్కో విభాగం నుండి 25 ప్రశ్నలు వస్తాయి.
🔥 పరీక్ష కేంద్రాలు :
- దేశంలోని అన్ని రాష్ట్రాలలో పలు ప్రముఖ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాలలోని పలు నగరాలలో పరీక్ష నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో పరీక్ష కేంద్రాలు :
- అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, అనంతపూర్, ఒంగోలు, రాజమండ్రి.
తెలంగాణ పరీక్ష కేంద్రాలు :
- హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్, సిద్దిపేట, ఆదిలాబాద్.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికయిన వారికి 13,000/- రూపాయల నుండి 25,000/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 30 జూన్ 2025.
👉 Click here for official website