ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, గుంటూరు నుండి 2025 – 26 సంవత్సరానికి గాను అగ్రికల్చర్ డిప్లమో లో అడ్మిషన్ పొందేందుకుగాను నోటిఫికేషన్ విడుదలయింది.
10వ తరగతి లేదా తత్సమానమైన అర్హతతో ఈ అగ్రికల్చర్ డిప్లమో చేసేందుకు గాను అర్హత కలిగి ఉంటారు.
అగ్రికల్చర్ డిప్లమో అడ్మిషన్ పొందేందుకుగాను ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయింపు జరుగుతుంది.
అగ్రికల్చర్ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉన్నందున ఈ కోర్సులకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.
NG Agriculture University Admissions :
ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి రిలీజ్ అయిన అగ్రికల్చర్ డిప్లమో నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
🔥 అగ్రికల్చర్ డిప్లమో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:
- ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, గుంటూరు నుండి ప్రతి సంవత్సరం ఈ నోటిఫికేషన్ విడుదలవుతుంది.
🔥 అగ్రికల్చర్ డిప్లమో మొత్తం సీట్ల వివరాలు :
- అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి మొత్తం నాలుగు ప్రోగ్రామ్ లలో కలిపి 3,218 సీట్లను అడ్మిషన్ నిమిత్తం అందుబాటులో ఉంచారు.
- అన్ని కోర్సులు కూడా ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే బోధన జరుగుతుంది.
- ఇందులో రెండు సంవత్సరాల కాల పరిమితితో మరియు మూడు సంవత్సరాల కాలపరిమితి తో కూడిన కోర్సులు ఉంటాయి.
క్రమ సంఖ్య | డిప్లొమా ప్రోగ్రామ్ | కాలపరిమితి | ప్రభుత్వ సీట్లు | అనుబంధ సీట్లు |
1 | డిప్లమో ఇన్ అగ్రికల్చర్ | 2 సంవత్సరాలు | 578 | 1900 |
2 | డిప్లమో ఇన్ సీడ్ టెక్నాలజీ | 2 సంవత్సరాలు | 25 | 260 |
3 | డిప్లమో ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ | 2 సంవత్సరాలు | 25 | 40 |
4 | డిప్లమో ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ | 3 సంవత్సరాలు | 60 | 330 |
- ప్రభుత్వ ఆధారిత సీట్లు 688 , అఫిలియేటెడ్ సీట్లు 2530 కలవు.
✅ Join Our What’s App Channel – Click here
🔥 అగ్రికల్చర్ డిప్లమో దరఖాస్తు విధానం :
- ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న వారు ఆన్లైన్ విధానంలో అధికారిక వెబ్సైట్ ద్వారా 28/05/2025 నుండి 16/06/2025 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
🔥 అగ్రికల్చర్ డిప్లమో హెల్ప్ డెస్క్ :
- అగ్రికల్చర్ డిప్లమోలో అడ్మిషన్ పొందేందుకు దరఖాస్తు చేసే విషయంలో ఎవరికైనా సందేహాలు సమస్యలు ఎదురైతే వారు పని దినాలలో ఉదయం 10:00 సాయంత్రం 5:30 లోపు హెల్ప్ డెస్క్ కు సంప్రదించవచ్చు.
- Domain contact details: 8008104977
- Tech support contact details : 9000523420
- Email ID: diploma. Angrau@gmail.com
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 28/05/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 16/06/2025
👉 Click here to download Notification
👉 Click here for official website